అన్ స్టాపబుల్ : చంద్రబాబు నాయుడు... నారా లోకేష్ ఎపిసోడ్ ప్రోమో విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వరలక్ష్మి శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తూ ఉండగా , దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ , అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీ లో నటించబోతున్నాడు. ఇలా ఇప్పటికే వరుస కమిట్ మెంట్ లతో ఫుల్ బిజీగా ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం ఆహా "ఓ టి టి" లో ప్రసారం అవుతున్న  అన్ స్టాపబుల్ సీజన్ 2 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసింది.
 

ఇప్పటికే అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించిన కొన్ని ఎపిసోడ్ ల షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2 అక్టోబర్ 14 వ తేదీన చాలా గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. అన్ స్టపబుల్ సీజన్ 2 కి మొదటి గెస్ట్ లుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు  నారా లోకేష్ రాబోతున్నారు. ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2 లో చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ కు సంబంధించిన ఎపిసోడ్ అక్టోబర్ 14 వ తేదీన స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ని ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఆహా నిర్వాహక బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని విడుదల చేసింది. ఆహా నిర్వాహక బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో బాలకృష్ణ ,  చంద్రబాబు నాయుడు ,  నారా లోకేష్ లు ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: