జిన్నా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్..!!
ఇక ఈ చిత్రం అక్టోబర్ 21 వ తేదీన విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్లను చాలా వేగవంతం చేస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ ను సన్నీలియోన్ తో చిత్రీకరించినట్లుగా సమాచారం. అందుకు సంబంధించి ఈ రోజున ఒక అప్డేట్ ని కూడా విడుదల చేశారు. సన్నీలియోన్ మంచు విష్ణు మధ్య వచ్చే జూరు మిఠాయి అనే సాంగ్ లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఈ పాటలో కూడా సన్నిలియోన్ తన గ్లామర్ తో ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.
మంచు విష్ణు కూడా సన్నిలియోన్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసినట్లుగా ఈ లిరికల్ వీడియోలో చూస్తే మనకి అర్థమవుతుంది. గత కొద్దిరోజులుగా మంచు ఫ్యామిలీ ఎక్కువగా ప్లాపులను చవిచూస్తోంది. మరి ఈ సినిమాతో ఎవరైనా మంచు విష్ణు సక్సెస్ అవుతారని ఆయన అభిమానులు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ లిరికల్ వీడియో మాత్రం చాలా వైరల్ గా మారుతోంది. మరి చిత్రంతోనైనా సన్నీలియోన్, పాయల్ , మంచు విష్ణు కెరియర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి మరి.