షాకింగ్ డివైడ్ టాక్ సినిమాకు 300 కోట్ల కలక్షన్స్ !

Seetha Sailaja

మణిరత్నం హవా అయిపోయింది కామెంట్స్ చేస్తున్న వారికి అతడి రేంజ్ ఏమిటో అందరికీ తెలిసి వచ్చేలా తన లేటెస్ట్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’ పార్ట్ వన్ మూవీతో సమాధానం ఇచ్చాడు. వాస్తవానికి ఈమూవీకి డివైడ్ టాక్ రావడంతో ఈమూవీ పరిస్థితి ఏమిటి అంటూ కోలీవుడ్ మీడియా వర్గాలు సందేహాలు వ్యక్తపరిచాయి. అయితే తమిళ చరిత్రకు సంబంధించిన ఈసినిమాను చూడటం తమ బాధ్యతగా తమిళులు భావించడంతో ఈమూవీకి డివైడ్ టాక్ వచ్చినా 300 కోట్ల కలక్షన్స్ క్లబ్ లో చేరిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు ఈమూవీకి ఓవర్సీస్ మంచి కలక్షన్స్ రావడమే కాకుండా ఈమూవీకి 5 మిలియన్ డాలర్లు కలక్షన్స్ రావడం మరింత ఆశ్చర్యంగా మారింది. వాస్తవానికి తమిళ ప్రజలు తమ భాషను తమ సంస్కృతిని విపరీతంగా గౌరవవిస్తారు. ఈమూవీ ఒక చందమామ కథ లాంటిది కాదు. రాచరికంలో ఉండే ఎత్తులు పై ఎత్తులు ఈసినిమా కథ నిండా కనిపిస్తాయి.
స్క్రీన్‌ప్లేలో మాస్ట‌ర్‌ గా పేరుగాంచిన మ‌ణిర‌త్నం ‘పొన్నియ‌న్‌ సెల్వ‌న్‌’ లో త‌డ‌బ‌డ్డాడు అన్న కామెంట్స్ వచ్చాయి. అయినా ప్రపంచ వ్యాప్తంగా తమిళ ప్రజలు మణిరత్నం పై ఉన్న గౌరవంతో ఈసినిమాను చూశారు. ఈమూవీ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో నేటితరం ప్రేక్షకుల అభిరుచి మారిపోయినప్పటికీ ఈమూవీ పై భారీ స్థాయిలో ఖర్చు పెట్టాడు. అయితే ఇలాంటి చారిత్రాత్మక కథలను ఎంచుకుని గతంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘బొబ్బిలియుద్ధం’ ‘విశ్వనాధ నాయకుడు’ బాలకృష్ణ 100వ సినిమాగా వచ్చిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలకు ప్రశంసలు దక్కాయి కానీ ఆర్ధిక పరమైన ఘన విజయాలు ఆసినిమాలకు రాలేదు.

దీనితో చరిత్రను తెలుసుకోవడంలో అదేవిధంగా చరిత్రను గౌరవించడంలో తమిళుల స్థాయిని తెలుగువారు అందుకోలేకపోతున్నారా అన్న సందేహాలు కలగడం సహజం. ‘ఆర్ ఆర్ ఆర్’ ఘనవిజయం సాధించినప్పటికీ అది ఊహాజనితమైన చరిత్ర కాని వాస్తవ చరిత్ర కాదు. ‘పొన్నియన్ సెల్వన్’ స్పూర్తితో రానున్న రోజులలో మన తెలుగులో కూడ ఇలాంటి చారిత్రాత్మక సినిమాలు ఎంత వరకు వస్తాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: