హిట్ స్టేటస్ కి అన్ని కోట్ల దూరంలో ఉన్న చిరంజీవి "గాడ్ ఫాదర్" మూవీ..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మలయాళం లో మంచి విజయం సాధించిన లూసిఫర్ మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. గాడ్ ఫాదర్ మూవీ కి మోహన్ రాజా దర్శకత్వం వహించగా , సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్రలో నటించగా , సత్యదేవ్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించింది.

గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5 వ తేదీన తెలుగు , హిందీ భాషలలో విడుదల అయింది. మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ లో హీరోగా నటించగా , బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినా సల్మాన్ ఖాన్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించడం , సత్యదేవ్ , నయన తార ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించడం , మోహన్ రాజా ఈ మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఇలా భారీ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న గాడ్ ఫాదర్ మూవీ 92 కోట్ల భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. అలా భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన గాడ్ ఫాదర్ మూవీ మొదటి రోజు మొదటి షో కే అద్భుతమైన టాక్ ని బాక్సా ఫీస్ దగ్గర తెచ్చుకోవడంతో ఈ మూవీ కి ప్రస్తుతం మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటివరకు మూడు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న గాడ్ ఫాదర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 34.36 కోట్ల షేర్ , 62.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్మలను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ని అందుకోవాలి అంటే మరో 57.64 కోట్ల కలెక్షన్ లను సాధించవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: