ఈ హీరో సంక్రాంతి బరిలో లేనట్టేనా..?

Divya
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సంక్రాంతి రాగానే ఒక ప్రత్యేకమైన సందడి నెలకొంటుంది. ముఖ్యంగా మూడు రోజులు చాలా సందడిగా ఉండటమే కాకుండా సినిమాల హవా కొనసాగుతూ ఉంటుంది. చరిత్రలో చూసుకుంటే సంక్రాంతికి , టాలీవుడ్ కి ఒక బలమైన సెంటిమెంటు కూడా ఉంది. ముఖ్యంగా ఆ పండుగలో చాలామంచి సక్సెస్ రేట్ పెరిగిందని కూడా చెప్పవచ్చు. అందుకే చాలా వరకు కొంతమంది హీరోలు పోటీ ఎంత ఉన్నా కూడా సంక్రాంతి బరిలో సినిమాలను రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే ఏడాది క్రితమే రిలీజ్ డేట్స్ పై క్లారిటీ ఇస్తూ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే 2023  సంక్రాంతి బరిలో కూడా స్టార్ హీరోలు పోటీ పడడానికి సిద్ధమవుతున్నారు.
ఇకపోతే ఒకరిద్దరి హీరోలు ఇప్పటికే వారి సినిమాకు సంబంధించి డేట్స్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక సంక్రాంతి విడుదల కోసం అని. ఇప్పటినుంచే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. అందులో భాగంగానే ప్రభాస్ ఆది పురుష్ సినిమా కూడా ప్రమోషన్స్ చేపడుతున్నారు. 3D టెక్నాలజీతో రామాయణం కథను తెరకేక్కిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక మరొకవైపు చిరంజీవి నటించిన 154వ చిత్రం వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతికి రాబోతోంది. ఇక నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమా కూడా అదే సమయంలో రావచ్చని తెలుస్తోంది.. ప్రస్తుతం ప్రభాస్ , చిరంజీవి , బాలకృష్ణ లాంటి అగ్ర హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఏదో ఒక సినిమాపై ప్రభావం అయితే పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఎవరో ఒకరు వెనకడుగు వేయక తప్పదు.
ప్రభాస్ ఇప్పటికే ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు కాబట్టి వెనక్కి తగ్గే అవకాశం లేదు..అందుకే  మెగాస్టార్ చిరంజీవి లేదా బాలకృష్ణ సినిమాలు మాత్రమే వాయిదా పడే అవకాశం ఉంది.  లేదా అంతకుముందే రావచ్చు అని కూడా తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ వెనక్కి తగ్గినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే సంక్రాంతి బరిలో బాలకృష్ణ లేనట్టే అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: