ఆస్కార్ కి ఆర్ఆర్ఆర్?

Purushottham Vinay
తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమాల్లో ఖచ్చితంగా ఆర్ఆర్ఆర్  ఒకటి.పాన్  ఇండియా  టాప్  డైరెక్టర్  దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మెగా నందమూరి హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్  వారి అభిమానులను ఎంతగానో అలరించారు.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటించి మెప్పించారు. ఇక ఈ ఇద్దరు హీరోలు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాకి దేశ విదేశాల నుంచి ప్రశంశలు దక్కాయి. గతంలో హాలీవుడ్ మ్యాగజైన్స్ సైతం ట్రిపుల్ ఆర్ మూవీకి అవార్డ్స్ గ్యారంటీ అని అభిప్రాయ పడుతూ నివేదికలు ఇచ్చాయి. ఇప్పటికే ఎన్నో రికార్డులను కొల్లగొట్టన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఏకంగా ఆస్కార్ బరిలో నిలిపేందుకు చిత్రయూనిట్ ప్రయత్నిస్తోంది. 15 విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ ఆర్ఆర్ఆర్ పోటీపడనుంది.మొత్తం 15 క్యాటగిరీలలో ఆర్ఆర్ఆర్ నామినేషన్స్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.


 1. బెస్ట్ మోషన్ పిక్చర్ - డీవీవీ దానయ్య, 2. బెస్ట్ డైరెక్టర్ (ఎస్ఎస్ రాజమౌళి), 3. బెస్ట్ యాక్టర్ (ఎన్టీఆర్ - రామ్ చరణ్), 4. ఉత్తమ సహాయ నటి (అలియా భట్), 5. ఉత్తమ సహాయక నటుడు (అజయ్ దేవగన్), 6. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే - (విజయేంద్ర ప్రసాద్ & రాజమౌళి), 7. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ (ఎంఎం కీరవాణి), 8. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ('నాటు నాటు'), 9. బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ (ఎ. శ్రీకర్ ప్రసాద్), 10. బెస్ట్ సౌండ్ (రాఘునాథ్ కెమిసెట్టి - బోలోయ్ కుమార్ డోలోయి - రాహుల్ కార్పే), 11. బెస్ట్ టోగ్రఫీ (కె. కె. సెంథిల్ కుమార్), 12. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ (సాబు సిరిల్), 13. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ (రమా రాజమౌళి), 14. బెస్ట్ మేకప్ & హెయిర్ స్టైలింగ్ (నల్లా శ్రీను - సేనాపతి నాయుడు), 15. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ (వి. శ్రీనివాస్ మోహన్).అయితే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ కాకపోయినా ఈ డిమాండ్ తో ఆస్కార్ జ్యూరీ సభ్యులను ఆకర్షిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: