'ది ఘోస్ట్' సినిమాకి నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Anilkumar
తాజాగా నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ స్పెథ్రిల్లర్ సినిమా ఘోస్ట్.ఇక ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. అయితే ది ఘోస్ట్ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న విడుదలకానుంది.ఇక  దీంతో ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్ షురూ అయ్యాయి. అంతేకాదు మంచి బజ్‌తో వస్తున్న ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనీఖా సురేంద్రన్, గుల్ పనాగ్‌లు కీలకపాత్రలో కనిపించనున్నారు.

కాగా  శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు.మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.  ఇదిలావుంటే ఇక  ఈ సినిమాకు నాగార్జున భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఘోస్ట్ సినిమాకు నాగార్జున 6 కోట్ల వరకు తీసుకుంటున్నారట. అంతేకాదు ఇక  ప్రాఫిట్స్‌లో షేర్ కూడా తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.ఇకపోతే సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా తర్వాత నాగార్జునకు సరైన విజయం లేదు.

అయితే  గతేడాది 'వైల్డ్ డాగ్' సినిమాతో పలకరించారు. ఇక పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు సరైన వసూళ్లు దక్కలేదు. అయితే ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి నాగార్జున తన తనయుడు 'బంగార్రాజు' సినిమాతో పలకరించారు. ఇక ఈ సినిమా సక్సెస్‌తో నాగార్జున బ్యాక్ బౌన్స్ అయ్యారనే చెప్పాలి.అయితే  ఆ ఊపుతోనే ఇపుడు నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్' సినిమా చేస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ ఏజ్‌లో కూడా నాగార్జున.. రా ఏజెంట్‌ పాత్రలో చేసిన స్టంట్స్ ఈ సినిమాలో హైలెట్ అని చెబుతున్నారు. ఇక గరుడ వేగ హిట్ చిత్రం తర్వాత ప్రవీణ్ సత్తారు... బంగార్రాజు వంటి సూపర్ సక్సెస్ తర్వాత నాగార్జున కలయికలో వస్తోన్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: