త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ సంచలన ట్విట్.. దుర్మార్గపు వ్యక్తి ..?
ఇప్పుడు తాజాగా మరొకసారి త్రివిక్రమ్ ను దుర్మార్గుడు అంటూ పెద్ద షాక్ ఇచ్చింది.. అసలు విషయంలోకి వెళ్తే ఆర్తి అగర్వాల్, వెంకటేష్ జంటగా నటించిన కామెడీ సినిమా నువ్వు నాకు నచ్చావ్. ఈ సినిమా న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ అయింది. ఈ సినిమాకి విజయ్ భాస్కర్, రవి కిషోర్ తెరకెక్కించగా కథ త్రివిక్రమ్ అందించారు. ఈ సినిమా రి రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందంతో పాటు త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు. ప్రమోషన్స్లో మాట్లాడుతూ కొన్ని సినిమాలు డబ్బు పేరు తీసుకువస్తాయి కానీ కొన్ని మాత్రమే గౌరవాన్ని తెస్తాయని చెప్పగా ఈ వీడియో వైరల్ గా మారడంతో ఈ వీడియో చూసిన పూనమ్ రెచ్చిపోయింది.
సోషల్ మీడియాలో స్పందిస్తూ.. స్త్రీలను మానసిక క్షోభకు గురిచేసి , ఏమీ తెలియనట్టుగా నటించగలిగే అత్యంత దుర్మార్గపు వ్యక్తి అతను.. మీలాంటి మీడియా కూడా అతనికి మద్దతు ఇవ్వడం వల్లే మా అసోసియేషన్ లాంటి వారు ఇలాంటి వ్యక్తులను ప్రశ్నించకపోవడం వల్లే ఇది సాధ్యమవుతుంది.. సాధారణంగా వదిలేయాల్సిన ఒక చిన్న కామెంట్ ని పట్టుకొని ఏదో పెద్ద గొప్పగా షేర్ చేస్తున్నారు. మీలాంటి వారి వల్లే మహిళల పైన వేధింపులు ఎక్కువవుతున్నాయని త్రివిక్రమ్ మాట్లాడిన వీడియో కింద కామెంట్స్ చేసింది. ఇందుకు సంబంధించి ఈ విషయం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.