హీరోయిన్ పూజ హెగ్డే సర్జరీ చేయించుకుందా.. ఇందులో నిజమెంతా..!!

Divya
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే అలవైకుంఠపురంలో సినిమా ద్వారా రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె ఇటీవల ప్రభాస్ తో కలిసి పాన్ ఇండియా సినిమా రాధే శ్యామ్ లో కూడా నటించింది. ఇక ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఇక అదే సమయంలో విజయ్ సరసన బీస్ట్ సినిమాలో అలాగే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాలో కూడా నటించగా మూడు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో అందరూ ఈమెను అందరూ ఐరన్ లెగ్ అని పిలవడం మొదలుపెట్టారు. అవకాశాలు మాత్రం వరుసగా వస్తూ ఉండడంతో నిజంగానే ఒక అదృష్టం దరిద్రంలా పట్టుకుంది అంటూ పొగిడే వాళ్ళు కూడా లేకపోలేదు.
ముఖ్యంగా టాలీవుడ్ లో అగ్ర హీరోలను వరుసగా లైన్లో పెడుతున్న ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తన మార్కు చూపిస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే తన గ్లామర్ ను మరింత పెంచుకోవడానికి తన బాడీ పార్ట్ కు సర్జరీ చేయించుకోబోతోందట. ముఖ్యంగా ఆ బాడీ పార్ట్ కోసమే విదేశాలకు త్వరలోనే వెళ్ళబోతోంది  అని సమాచారం. ఇకపోతే తెలుగులో పూజా హెగ్డే కు లైఫ్ ఇచ్చింది మాత్రం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పవచ్చు. కానీ అప్పట్లో వీరిద్దరి మధ్య ఏదో ఉందని ప్రచారం జోరుగా సాగింది.. అంతేకాదు అందుకే పూజ హెగ్డేకు ఎక్కువగా తన సినిమాలలో అవకాశాలు ఇస్తున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి. నిజానికి అరవింద సమేత అలవైకుంఠపురంలో వంటి సినిమాలలో కూడా ఈమెకు అవకాశాలు ఇచ్చాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

ఇకపోతే ఇప్పటివరకు టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకోవడానికి సర్జరీలు చేయించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోని పూజా హెగ్డే కూడా తన ముక్కుకు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయం తీసుకుందట.ఇక ఇదే విషయం ప్రస్తుతం బాలీవుడ్ లో టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: