కమల్ అభిమానుల కోరిక తీరుతుంది గా!!

P.Nishanth Kumar
గత కొన్ని రోజులుగా కమల్ హాసన్ అభిమానులు ఎంతో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. విక్రమ్ సినిమా అంత పెద్ద హిట్ అయినా కూడా వారిలో తీవ్ర అసంతృప్తి కి కారణం లేకపోలేదు. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “విక్రమ్”. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విజయం ఆయనకు మంచి పుష్ ఇచ్చింది అని చెప్పాలి. చాలా రోజుల తర్వాత అయన ఈ స్థాయి లో హిట్ దక్కింది. అయితే కమల్ హాసన్ ఈ హిట్ తో మళ్ళీ ఆగిపోయిన తన సినిమా కు మోక్షం కలిగించాలన్న ఉద్దేశ్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. విక్రమ్ హిట్ అయిన నేపథ్యంలో ఈ హిట్ తో నెక్స్ట్ సినిమాలపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి ప్రేక్షకులలో.
ఆ విధంగా  తన లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ చిత్రం గా ఉన్న “ఇండియన్ 2” కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. దర్శకుడు శంకర్ తో చేసిన భారతీయుడు అనే సినిమా కి సెన్సేషనల్ హిట్ కి సీక్వెల్ కాగా దీనిని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమా మధ్యలోనే ఆగిపోగా ఈ సినిమా ఇక తెరకెక్కదా అన్న అనుమానాలు అందరిలో కలిగాయి. శంకర్ కు, లైకా నిర్మాతలకి మధ్య పొసగకపోవడం వంటివి ఈ సినిమా మధ్య లోనే అయిపోవడానికి కారణం. ఏదైతేనేం కమల్ హాసన్ మధ్యవర్తిగా వ్యవహరించి ఈ సినిమా ను మళ్ళీ మొదలయ్యే విధంగా చేశాడు.
చాలా రోజులు వీరిద్దరి మధ్య సంధి కుదర్చడానికి అయన ప్రయత్నాలు చేశాడు. తాజాగా ఈ రోజు ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలైనట్లుగా తెలుస్తుంది. తమిళ మీడియా వర్గాల్లో ఈ విషయం హల్చల్ అవుతుంది.మరి ఈ సినిమా ను ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి.  మ‌రో వైపు రామ్ చ‌ర‌ణ్‌తో RC 15ను పూర్తి చేసుకుంటూ వ‌స్తున్నారు శంక‌ర్‌. ఈ సినిమా లను వచ్చే ఏడాది విడుదల చేయాలనీ శంకర్ భావిస్తున్నారు. మరి భారతీయుడు సినిమా ఎలాంటి ఆటంకాలు లేకుండా విడుదల వరకు సాఫీగా సాగుతుందా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: