ఒకే ఒక జీవితం సినిమాపై స్పందించిన హీరోయిన్ అతిధి ..!!
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తల్లి కొడుకుల మధ్య సెంటిమెంట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు సైతం ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు. ఇక వీటితోపాటు వెన్నెల కిషోర్, ప్రియదర్శనిల కామెడీ చాలా అద్భుతంగా ఉందని కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ చిత్రంపై తాజాగా హీరోయిన్ అతిధిరావు హైదరి స్పందించడం జరిగింది. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అతిథి రావు హైదరి ఇలా స్పందిస్తూ.. నాకు కన్నీళ్లు తెప్పించి నా హృదయాన్ని నవ్వించినందుకు ధన్యవాదాలు.. ఈ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన ఒక వ్యక్తి గురించి చెప్పి ఇలా సినిమా తీసినందుకు థాంక్యూ.. అమ్మలు నిజంగా ప్రపంచాన్ని ఉత్తమ ప్రదేశంగా మారుస్తూ ఉంటారని. ఈ సినిమా మీ అమ్మలను తీసుకువెళ్లి ప్రతి ఒక్కరు చూడండి అంటూ ట్విట్టర్లో తెలియజేయడం జరిగింది. ఇక అతిథి రావు శర్వానంద్ కలిసి మహాసముద్రం సినిమాలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే గత కొన్ని రోజులుగా హీరో సిద్ధార్థ అతిధిరావు హైదరి ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.