రమ్యకృష్ణ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణవంశీ..!!

Divya
లెజెండ్రీ యాక్ట్రెస్ గా గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఈమె ఎన్నో సినిమాలలో నటించి, తన నటనతో ఆ పాత్రలకు ప్రాణం పోసింది. ఇక నీలాంబరిగా విలనిజాన్ని చూపించిన రమ్యకృష్ణ శివగామిగా రాజసం చూపించింది. ఇక ఏ పాత్రలో నటించినా సరే ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసే అద్భుతమైన హీరోయిన్ అని చెప్పవచ్చు. ఇకపోతే ఈమె ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.ఇకపోతే దాదాపుగా చంద్రలేఖ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాలేదు. దాదాపు 24 సంవత్సరాల విరామం తర్వాత ఇప్పుడు రంగమార్తాండ సినిమాలో వీరిద్దరూ పనిచేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా రమ్యకృష్ణ గురించి , ఆమె భర్త కృష్ణవంశీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు
 
కృష్ణవంశీ మాట్లాడుతూ.. రమ్యకృష్ణ నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టలేదు.  శ్రీ ఆంజనేయం సినిమా తర్వాత మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి అనేది నిజం కాదు అని ఆయన వెల్లడించారు.  ఇక ఆమె డబ్బులు పెట్టుబడిగా పెట్టలేదని,  రమ్యకృష్ణ అమాయకురాలు కాదు అని కృష్ణవంశీ తెలిపారు. ఇక కొడుకు సినిమాల్లోకి వస్తాడో లేదో అనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పకపోవడం గమనార్హం.ఇకపోతే కృష్ణవంశీ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఇక కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది . ఈ సినిమాలో రమ్యకృష్ణ, అనసూయ,  ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు.
ఇక ఈ సినిమాతో కృష్ణవంశీ భారీ సక్సెస్ ను అందుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మరి కొంతమంది ఇందులో రమ్యకృష్ణ నటిస్తోంది కాబట్టి పక్కా బ్లాక్ బాస్టర్ అంటూ ముందే జ్యోతిష్యం చెబుతూ ఉండడం గమనార్హం.మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో విడుదల అయ్యే వరకు వేచి ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: