ఆ కారణంతోనే ఉదయభాను 'బిగ్ బాస్' సీజన్ 6 లో భాగం కాలేదా..?

Pulgam Srinivas
తెలుగు లో యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యాంకర్ ఉదయ భాను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా ఎంతో మంది ప్రేక్షకులను అద్భుతంగా అలరించిన ఉదయ భాను అనేక మూవీ లలో నటించి కూడా ప్రేక్షకులను అలరించింది. అలాగే ఉదయ భాను , శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా హీరోగా తెరకెక్కిన లీడర్ మూవీ లో ఒక ప్రత్యేక సాంగ్ లో కనిపించి కూడా ప్రేక్షకులను అలరించింది.

ఇలా బుల్లి తెర ద్వారా వెండి తెర ద్వారా ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఉదయ భాను ప్రస్తుతం కూడా అనేక సినిమా ఫంక్షన్ లకు యాంకర్ గా వ్యవహరిస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే యాంకర్ గా నటిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న ఉదయ భాను తాజాగా ప్రారంభం అయిన బిగ్ బాస్ సీజన్ 6 లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పటికే ప్రారంభం అయ్యింది.

కాక పోతే ఉదయ భాను మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. దీనితో ఉదయ భాను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వకపోవడానికి ఇదే కారణం అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ...  బిగ్ బాస్ సీజన్ 6 లో ఉదయ భాను ను కంటెస్టెంట్ గా పాల్గొనడానికి బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించగా ఉదయ భాను బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఎక్కువ మొత్తం రెమినేషన్ ని అడగడంతో బిగ్ బాస్ నిర్వాహక బృందం వెనక్కు తగ్గినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: