బాలీవుడ్ లో రష్మిక సక్సెస్ అయ్యేనా..!!

Divya
తెలుగు ప్రేక్షకులకు రష్మిక అంటే సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ పొజిషన్లో దూసుకుపోతోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరుపొందింది. దీంతో బాలీవుడ్లో పలు సినిమాలలో నటించే అవకాశం దక్కించుకుంది. అలా మొదటి చిత్రం హీరో అమితాబచ్చన్ కూతురుగా నటించే అవకాశం దక్కించుకుంది. ఆ చిత్రమే గుడ్ బై. ఈ చిత్రం అక్టోబర్ 7వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. రష్మిక నటించిన మరొక చిత్రం మిషన్ మజ్ను. ఈ చిత్రంలో సిద్ధార్థ మల్హోత్ర హీరోగా నటించారు ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం.

అయితే వాస్తవానికి మొదట రష్మిక మొదలుపెట్టిన చిత్రం మిషన్ మజ్ను. ఈ చిత్రం బాలీవుడ్ లో డబ్ల్యు మూవీ గా విడుదల కావలసి ఉండగా ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర పనులు వల్ల రిలీజ్ డేట్ ఆలస్యం అవుతోంది. దీంతో తన చాలా ఆలస్యంగా ప్రారంభించిన గుడ్ బై చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ చిత్రంలో రష్మిక నటన ఎంతో అద్భుతంగా నటించిందని గుడ్ బై సినిమా ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతొంది. మరి రష్మిక తను నటించిన మొదటి సినిమాతోనే సక్సెస్ అయి బాలీవుడ్లో కొనసాగుతున్న లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

తాజాగా గుడ్ బై సినిమా ఈవెంట్ లో రష్మిక పుష్ప-2  గురించి కూడా తెలియజేసింది. ఇది 2020 బ్లాక్ బాస్టర్ చిత్రం పుష్ప ది రైజ్ సీక్వెల్ త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఇద్దరు స్టార్ హీరోలు అయినా అమితాబచ్చన్, అల్లు అర్జున్ తో కలిసి పని చేయడం ఎలా ఉంది అనే ప్రశ్న ఎదురవుగా.. అందుకు రష్మిక మాట్లాడుతూ నేను నా కలను జీవిస్తున్నాను ఎందుచేత అంటే అల్లు అర్జున్తో పుష్ప -2  నటిస్తూ ఉన్నాను.. మరో రెండు రోజుల షూటింగ్ ప్రారంభమవుతోంది.. ప్రస్తుతం బచ్చన్ సార్ తో గుడ్ బై ప్రచారంలో బిజీగా ఉన్నాను.. ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టుగా తెలియజేసింది ఆయనతో పని చేయడం చాలా గొప్ప అనుభూతి అని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: