పూజా కార్యక్రమాలతో శర్వానంద్ కొత్త సినిమా ప్రారంభం..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న యువ నటులలో ఒకరు అయినటు వంటి శర్వానంద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోగా దూసుకుపోతున్న శర్వానంద్ తాజాగా తన కొత్త సినిమాను ప్రారంభించాడు. శర్వానంద్ తన కొత్త సినిమాను కృష్ణ చైతన్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా బ్యానర్ లో చేయబోతున్నాడు. ఈ మూవీ లో రాశి కన్నా , శర్వానంద్ సరసన హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ మూవీ ఈ రోజు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ మూవీ పూజా కార్యక్రమాలకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.
 

శర్వానంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా పీపుల్స్ మీడియా బ్యానర్ లో తేరకేకుతున్న మూవీ కి దర్శకత్వం వహించబోతున్న కృష్ణ చైతన్య ఇది వరకు నితిన్ హీరోగా మేఘ ఆకాష్ హీరోయిన్ గా తెరకెక్కిన చల్ మోహనరంగా మూవీ కి దర్శకత్వం వహించాడు. శర్వానంద్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా కృష్ణ చైతన్య దర్శకత్వంలో పీపుల్స్ మీడియా బ్యానర్ లో తేరకేక్కబోయే మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితం అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో రీతు వర్మ హీరోయిన్ గా నటించగా ,  ప్రియదర్శి , వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు. అక్కినేని అమల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 9 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: