చిరంజీవి నాగార్జున పోటీలో సమాధానం లేని ప్రశ్నలు !

Seetha Sailaja
‘లైగర్’ ఫలితం తేలిపోవడంతో అందరి దృష్టి దసరా పండుగ సినిమాల వార్ పై ఉంది. సెప్టెంబర్ నెల అంతా మీడియం రేంజ్ సినిమాల హడావిడి కొనసాగితే అక్టోబర్ 5న రాబోతున్న దసరా కు మాత్రం మళ్ళీ భారీ సినిమాల హడావిడి కనిపించబోతోంది. విజయదశమి రోజున చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీతో నాగార్జున ‘ఘోస్ట్’ మూవీలు ఒకదానిపై ఒకటి పోటీగా విడుదల కాబోతున్నాయి.

చిరంజీవి నాగార్జున చాల సన్నిహిత మిత్రులు. దీనికితోడు గతంలో వీరు అనేక వ్యాపారాలు కూడ కలిసి చేసారు. అక్కినేని అఖిల్ ను చిరంజీవి దంపతులు తమ సొంత బిడ్డలా భావిస్తారు. అలాంటి చిరంజీవి నాగార్జునుల మధ్య పోటీ ఏమిటి అంటూ ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. వాస్తవానికి నాగార్జున తలుచుకుంటే తన ‘ఘోస్ట్’ మూవీని ‘గాడ్ ఫాదర్’ తో పోటీగా కాకుండా సెప్టెంబర్ నెలాఖరున దసరా పండుగ ప్రారంభం అయ్యే ముందు విడుదల చేసుకోవచ్చు.

అయితే నాగార్జున స్వయంగా తాను కూడ దసరా రేస్ లో ఉంటానని చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరంజీవి సినిమాల ఓపెనింగ్ కలక్షన్స్ స్టామినాతో పోల్చుకుంటే నాగార్జున సినిమాల ఓపెనింగ్ కలక్షన్స్ చాల తక్కువగా ఉంటాయి. దీనికితోడు ఈమధ్య కొంతకాలంగా నాగార్జున మార్కెట్ మరీ పడిపోయింది. ‘బిగ్ బాస్’ షో అన్నది లేకపోతే నాగార్జున పేరు జనం ఎప్పుడో మర్చిపోయే వారు అన్న మాటలు కూడ ఉన్నాయి.

ఈవిషయాలు అన్నీ నాగార్జున దృష్టికి వచ్చికాబోలు తనకు 63 సంవత్సరాలు వయసు వచ్చినా తాను ఇంకా ఎవరికైనా పోటీ ఇవ్వగలను అన్న ఉద్దేశ్యంతో నాగ్ చిరంజీవితో పోటీకి అంగీకరించాడ అన్న సందేహాలు మరికొందరికి వస్తున్నాయి. సంక్రాంతి సీజన్ తో పోల్చుకుంటే సినిమాలకు కలక్షన్స్ పరంగా దసరా చెప్పుకోదగ్గ సీజన్ కాదు అయినప్పటికీ ఈ సీజన్ ను టార్గెట్ చేస్తూ ఇద్దరు టాప్ సీనియర్ హీరోలు పోటీ పడుతూ ఉంటే మధ్యలో యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన ‘స్వాతిముత్యం’ సినిమాతో పోటీ పడటం మరింత ఆశ్చర్యం..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: