పవన్ సురేందర్ రెడ్డి సినిమా ఉన్నట్టా?లేనట్టా?

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు పుట్టిన రోజు జరుపు కుంటున్నాడు. ఈయన పుట్టిన రోజు అంటే ఫ్యాన్స్ కు ఎంతో అమితమైన ఆనందం అనే చెప్పాలి.. దీంతో ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియా వేదికగా హడావిడి చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు ఇంకా అలాగే రాజకీయ ప్రముఖులు సైతం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.ఫ్యాన్స్ ఈయన పుట్టిన రోజు సంబరాలు అంబరాన్ని అంటేలా వేడుకగా చేస్తున్నారు.. ఇది ఇలా ఉండగా సరిగ్గా రెండేళ్ల ముందు ఇదే రోజు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించారు.. నిర్మాత రామ్ తాళ్లూరి తో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా ప్రకటించారు.అయితే ఈ సినిమా ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు.. అలాగే ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.. కానీ ఈ రోజు రెండేళ్ల తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ జరుగుతుంది.

ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని.. త్వరలోనే పట్టాలెక్క నుందని రామ్ తాళ్లూరి సోషల్ మీడియా వేదికగా ఒక అభిమానికి చెప్పుకొచ్చారు.ప్రస్తుతం సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ తో ఏజెంట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమా పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాను స్టార్ట్ చేస్తామని క్లారిటీ ఇవ్వడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమా వక్కంతం వంశీ కథ అందించ నుండగా.. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లైనప్ లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది. ఇంకా ఈ సినిమాతో పాటు వినోదయ సీతమ్ రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలు ఉన్నాయి. మరి వీటిలో ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: