విజయ్ దేవరకొండ కెరియర్ డేంజర్ జోన్ లో ఉందా..!!
అయితే ఇక్కడ దాకా ఇదంతా బాగానే ఉన్నప్పటికీ విజయ్ దేవరకొండ సినిమా ప్రమోషన్లు చేసిన హడావిడి ఆ సినిమా రిసల్ట్ కు అసలు సంబంధం లేకుండా ఉండడం జరిగింది. లైగర్ సినిమా తో విజయ్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమాని డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయగా డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు గొప్పలు చెప్పుకున్న తిప్పలు తప్పలేదని చెప్పవచ్చు.
ఈ చిత్రానికి రూ. 200 కోట్లు ఓటిటి ఆఫర్ వచ్చిన తన సినిమాకు అంతకుమించి వసూలు చేస్తుందని నమ్మకంతో ఈ సినిమాని థియేటర్లలో వదిలారు చిత్రం బృందం. దీంతో ఆగస్టు 25న ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అవుతుంది అని విడుదల చేయగా తీర విడుదలయ్యాక. విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి ఇంత ఓవర్ గా మాట్లాడాడు అవసరమా అంటూ నెటిజన్లు సైతం కామెంట్లు చేశారు దీంతో మొదటి రోజే అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. టాలీవుడ్ లో ఎక్కువ డిజాస్టర్ లిస్టు కలిగిన హీరోలలో విజయ్ టాప్-5 లో చోటు సంపాదించుకున్నాడు. దీంతో ఈ హీరో కెరియర్ డేంజర్ జోన్ లో ఉందని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.