సలార్ షూటింగ్ అప్డేట్ ఇదే..!!

Divya
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ ప్రశాంతనిల్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ కూడా నటిస్తున్నది. ఇక టాలీవుడ్ లో నిర్మాతల బందు కారణంగా వరుస సినిమా షూటింగ్ లు కూడా నిలిచిపోయాయి. మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమా షెడ్యూల్ తో చాలా బిజీగా ఉన్న డైరెక్టర్ ప్రశాంత్ ని బంద్ తర్వాత తన సరికొత్త షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సలార్ సినిమా కొత్త షెడ్యూల్ ని నిర్వహించబోతున్నట్లు సమాచారం.

హైదరాబాదులో ప్రత్యేకంగా వేసిన ఒక సెట్ లో సలార్ షూటింగ్ జరగబోతున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెలియజేయడం జరిగింది. దాదాపుగా 28 రోజుల తర్వాత ఈ సినిమా షెడ్యూల్ షూటింగ్ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు డైరెక్టర్. ఈ షెడ్యూల్లో ప్రభాస్ పై అత్యంత కీలకమైన యాక్సిడెంట్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రభాస్ శృతిహాసన్ మధ్య కొన్ని లవ్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా చిత్రీకరణ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ సినిమా షూటింగ్లో పాల్గొంటున్న శృతిహాసన్ ఆ షూటింగ్ పూర్తి అయిన వెంటనే సలార్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతోంది.

ఇక ప్రభాస్  రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకులను అభిమానులను నిరాశపరచడంతో సలార్ చిత్రం పైన అభిమానుల సైతం చాలా ఆశపెట్టుకొని ఎదురుచూస్తున్నారు. కే జి ఎఫ్ సినిమాతో ఏకంగా కొన్ని కోట్ల రూపాయల కలెక్షన్స్ ను సాధించిన డైరెక్టర్ ప్రశాంత్ నిల్.. ఈ సినిమా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ప్రభాస్ ఖాతాలో కచ్చితంగా విజయం పడుతుందని ధీమాతో ఉన్నారు అభిమానులు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ తో పాటు మలయాళం స్టార్ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ సలార్, ఆది పురుష్, ప్రాజెక్టు-k వంటి సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. ఇక అలాగే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: