హిందీలో మొదటి రోజు అత్యధిక కలెక్షన్లను సాధించిన పది టాప్ సౌత్ సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా మొదటి రోజు బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన 10 సౌత్ ఇండియా సినిమాల గురించి తెలుసుకుందాం. యాష్ హీరోగా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ మొదటి రోజు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 53.95 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 2 మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు 41 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో మూవీ మొదటి రోజు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 24.4 కోట్ల కలెక్షన్ లను సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి రోజు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 20.07 కోట్ల కలెక్షన్ లను సాధించింది. రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రోబో 2.0 మూవీ మొదటి రోజు బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర 19.74 కోట్ల కలెక్షన్ లను సాధించింది.


విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో త్రికెక్కిన లైగర్ మూవీ బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర మొదటి రోజు 5.75 కోట్ల కలెక్షన్ లను సాధించింది. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సినిమా మొదటి రోజు బాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర 5.15 కోట్ల కలెక్షన్ లను సాధించింది. ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ మొదటి రోజు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 4.50 కోట్ల కలెక్షన్ లను సాధించింది. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన జంజీర్ మూవీ మొదటి రోజు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 3.58 కోట్ల కలెక్షన్ లను సాధించింది. రజనీ కాంత్ హీరోగా తెరకెక్కిన కబాలి మూవీ మొదటి రోజు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర 3.50 కోట్ల కలెక్షన్ లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: