వావ్: అందుకే కదా రష్మి కానీ నేషనల్ క్రష్ అనేది..!!

Divya
కిరాక్ పార్టీ సినిమాతో మొదటిసారిగా వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత దక్షిణాదిలో వరుస ఆఫర్లను దక్కించుకుంది. సౌత్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇక పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం హిందీలో కూడా వరుస సినిమా ఆఫర్లను అందుకుంటు బిజీ హీరోయిన్గా మారిపోతోంది. ఇక అభిమానులు కూడా రష్మిక ముద్దుగా ఉండడంతో ఈమెను నేషనల్ క్రష్ అని పిలుస్తూ ఉంటారు.
రష్మిక నటిస్తున్న వాటిలో గుడ్ బై, యానిమల్, మిస్టర్ మజ్ను, పుష్ప -2 వంటీ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నది. గత కొన్ని రోజులుగా రష్మిక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న యూనిమల్ సినిమా షూటింగ్లో పాల్గొంటూ ఉన్నది తాజాగా ముంబై విమానాశ్రయంలో రష్మిక చేసిన పనికి అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. క్యాజువల్ లుక్ లో ఉన్న రష్మిక విమానాశ్రయం నుంచి బయటకు రాగానే అక్కడ ఉన్న కొంతమంది అభిమానులను ఒక్కసారిగా ఆమె చుట్టూ ముట్టారు.
కొంతమంది ఆమెతో సెల్ఫీ దిగడానికి కూడా ప్రయత్నించారు..అయితే ఆమె వారందరినీ ఏమీ అనకుండా కేవలం ఫోటోలు దిగి వారితో సరదాగా మాట్లాడి పంపించింది. అలాగే చిన్నపిల్లల అభిమానులను దగ్గరకు తీసుకొని వారితో కూడా ఫోటోలు వీడియోలు దిగడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారుతోంది... దీన్నిబట్టి చూస్తే రష్మిక డౌన్ టు ఎర్త్ అని ఎంతో సింప్లిసిటీగా ఉందని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది అందుచేతనే ఏమైనా నేషనల్ ప్రస్తుతానికి పిలుస్తూ ఉంటారని పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇక ఇటీవల పుష్ప-2 సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: