ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అయినప్పటి నుంచి నెటిజన్లు సోషల్ మీడియాను బాగా వాడుతున్నారు. ఇక సెలెబ్రేటీలు కూడా సోషల్ మీడియాకు బాగా అలవాటు పడుతున్నారు.ఇక మీమర్స్ మాత్రం తెగ మీమ్స్ తో సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రెటీలతో బాగా ఆడుకుంటున్నారు అని చెప్పవచ్చు.ఏదైనా సినిమాలో నటీనటులకు సంబంధించిన సీరియస్ సన్నివేశాలు ఉంటే వెంటనే వాటికి మీమ్స్ క్రియేట్ చేసి నెట్టింట్లో తెగ వైరల్ గా మారుస్తున్నారు. అంతేకాకుండా డైలాగ్స్ ను కూడా ఫన్నీ గా క్రియేట్ చేసి బాగా ఎడిట్ చేస్తుంటారు. ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్ లను బాగా ట్రోల్ చేశారు.స్టార్ హీరోలను కూడా అసలు వదలట్లేరు.వాళ్ళు మాట్లాడిన ఓవర్ మాటలను కూడా వెంటనే ట్రోల్ చేస్తుంటారు.టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో విజయ్ దేవరకొండ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతోనే ఎంతో మంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా సక్సెస్ లతో పాటు ఫ్లాపులను కూడా ఎదుర్కొన్నాడు.ఇక నిన్న స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు.ఇందులో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. ఇక పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో విడుదల అవుతుందని గతంలో చెప్పటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వెలువడ్డాయి.అంతే కాకుండా ఈ సినిమా నుండి ముందుగానే విడుదలైన ట్రైలర్, ఫోటోలు కూడా ప్రేక్షకులను మరింత ఆశ పుట్టించాయి. అయితే అన్నట్టుగానే ఈ సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు రాగా మొదటి టాక్ తోనే ఈ సినిమా డిజాస్టర్ అని ముద్ర పడింది. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ.. ప్రస్తుతం విజయ్ పై బాగా ట్రోల్స్ వస్తున్నాయి.ఇంతకు అసలు ఏం జరిగిందంటే.. మొదట ఈ సినిమా హక్కులను డైరెక్ట్ సాటిలైట్, ఓటీటీ రూ. 200 కోట్లతో ఆఫర్ చేసింది. కానీ విజయ్ దేవరకొండ గతంలో తన సోషల్ మీడియా వేదికగా ఇది చాలా తక్కువ అంటూ.. థియేటర్లో దీనికంటే రెట్టింపుతో చేయిస్తాను అని ఓవర్ కాన్ఫిడెంట్ తో అన్నాడు. కానీ ఇప్పుడు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి కేవలం 90 కోట్లకు రావటమే చాలా గొప్పగా మారింది. దీంతో విజయ్ దేవరకొండ చేసిన ఓవర్ వల్లే ఈ సినిమా పోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. విజయ్ మాట్లాడిన అతి వాగుడిని ఎడిట్ చేసి మీమ్స్ వేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు.