హీరో నిఖిల్ ఎమోషనల్ కావడానికి కారణం..!!
ఇక ఈ సినిమా సక్సెస్ తో చాలా జోరు మీద ఉన్న నిఖిల్.. తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసి మళ్లీ హాట్ టాపిక్ గా మారాడు. తాజాగా ఒక ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడిన నిఖిల్.. ఏదైనా సినిమా ప్రేక్షకుల ముందుకు వెళ్లాలి అంటే ముఖ్యంగా కథ బాగుండాలి అని తెలిపారు నిఖిల్.. కథ బాగుంటే తప్పకుండా విజయం లభిస్తుందని కూడా తెలిపారు. సినీ ఇండస్ట్రీ లోకి రావడం కోసం తను చాలా కష్టపడ్డాననీ.. తనకి కూడా ఒక గాడ్ ఫాదర్ ఉండి ఉంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కాదని తెలియజేశారు.
సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం ఒక పెద్ద సాహసమే అని తెలిపారు. ప్రేక్షకుల నుంచి పొందుతున్న ఆదరాభిమానాలు చూస్తుంటే తన మొదటి సినిమా హ్యాపీ డేస్ రోజులు తనకు గుర్తుకు వస్తున్నాయని తెలియజేశారు. హ్యాపీ డేస్ సినిమా తర్వాత వరుసగా ఆరు సినిమాలు చేశాను ఆ సమయంలో తనకు ఎలాంటి కథలను ఎంచుకోవాలో తెలియక సతమతమయ్యాను అలా వరుస ప్లాప్లు వచ్చాయి ఆ తర్వాత స్వామి రారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నానని ఎమోషనల్ అయ్యారు.