అనసూయ: ఆంటీ అంటూ ఆడుకుంటున్న నెటిజన్స్?

Purushottham Vinay
ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు అందరూ కూడా అనసూయ ఆంటీ అనే జపం చేస్తున్నారు. ఈ హాట్ యాంకర్ ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ బిజీగా మారింది. ఇక మరోపక్క సోషల్ మీడియాలో తనకు నచ్చనివాటిపై ట్వీట్స్ చేసి ట్రోలర్స్ చేతికి చిక్కుతూ ఉంటుంది.ఇక నిన్న విజయ దేవరకొండపై అక్కసు వెళ్లగక్కి మరోసారి ట్రోలింగ్ బారిన పడింది. అమ్మ అన్న పదం అర్జున్ రెడ్డిలో అన్నాడని ఆ ఉసురు తగిలే లైగర్ సినిమా ప్లాప్ అయ్యిందని చెప్పుకొస్తూ ట్వీట్ చేసింది. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు విరుచుకుపడ్డారు. జబర్దస్త్ లో ఇంతకంటే అసభ్యకరంగా మీరు మాట్లాడినప్పుడు ఏమైంది ఇదంతా అంటూ ఏకిపారేస్తున్నారు. అంతేకాకుండా అనసూయ ఆంటీ పేరుతో హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసి దాన్ని ట్రెండింగ్ చేశారు. ఇక ఆంటీ అని పిలవొద్దు అని, అలా పిలిచినా వేధించినట్టే అంటూ అనసూయ ట్విట్టర్ లో ప్రతి ఒక్కరికి తనదైన రీతిలో కౌంటర్లు ఇస్తోంది.


ఆంటీ.. నువ్వు నీతులు చెప్పకు అని కొందరు. ఆంటీ అని పిలిస్తే కేసు పెడతావా.. స్టార్ హీరో ప్రభాస్ నే అంకుల్ అని పిలుస్తున్నారు.. నువ్వెంత ఆంటీ.. చీప్ గా బిహేవ్ చేయకు.. అటెన్షన్ కోసమా ఇదంతా చేస్తున్నావని అర్ధమవుతుంది అని ఒక నెటిజన్ అనగా అందుకు అనసూయ సమాధానం ఇస్తూ 'తప్పు.. అది కూడా తప్పు.. తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి. గొప్పగా గౌరవించకుండా.. అంకుల్ అన్నమని వీర్రవీగడం తప్పు' అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఏదిఏమైనా అనసూయ ఇలా ఎందుకు చేస్తుందో..? దేనికోసం చేస్తుందో తెలియడం లేదని మరికొందరు వాదిస్తున్నారు. అయితే అనసూయ ఇదంతా కూడా అటెన్షన్ కోసం చేస్తుందా అంటూ ఎక్కువగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ దూమారం ఎంత వరకు వెళుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: