అదిరిపోయిన లైగర్ USA ప్రీ సేల్స్ ?

Purushottham Vinay
రెండేళ్లుగా జనాల్ని ఊరిస్తూ వస్తోన్న విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఎట్టకేలకు ఈ నెల 25 వ తేదీన పాన్ ఇండియా లెవల్లో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా గురించి కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు..పాన్ ఇండియా అంత కూడా ఆసక్తితో వెయిట్ చేస్తోంది.ఆగస్టు నెలలో టాలీవుడ్‌కు మంచి హిట్లు పడ్డాయి. ఇక ఇప్పటికే మూడు సూపర్ హిట్ సినిమాలు రాగా. లైగర్‌తో ఆ ఊపు కంటిన్యూ అవుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. దీనికి తోడు బాలీవుడ్‌లో వరుస ప్లాపులకు తోడు.. అక్కడ టాలీవుడ్ సినిమాల డామినేషన్ కార్తీకేయ సినిమాతో ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది.లైగర్‌కు బాలీవుడ్‌లో కరణ్ జోహార్ బ్యాకప్ ఉండడంతో పాటు ఆయన కూడా నిర్మాణ భాగస్వామిగా ఉండడంతో బాలీవుడ్‌లో కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్‌కాగా ఎక్కడికక్కడ ఈ సినిమా దుమ్ము రేపుతోంది.అసలు నార్త్‌లో కూడా ఫస్ట్ వీకెండ్ మూడు రోజులకు భారీగా అడ్వాన్స్ బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఇక యూఎస్ లో కూడా రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ నమోదయ్యాయి.


ఏకంగా 150k డాలర్ల పైగా ఇక ప్రీమియర్స్ తో ఈ సినిమా 500k డాలర్ల పైగా వసూళ్లు రాబట్టిన ఆశ్చర్య పొనవసరం లేదు.గ్రాస్ టికెట్స్ నమోదయ్యాయి.ఇక లైగర్ సెన్సార్ కూడా పూర్తయ్యింది.చాలా షార్ట్ రన్ టైంని ఫిక్స్ చేశారు.ఇక చాలా క్రిస్పీగా సినిమాను కట్ చేశారనే అనుకోవాలి. లైగర్ సినిమా రన్ టైం 2 గంటల 20 నిమిషాల సినిమా ఇది. సెన్సార్ వాళ్లు మొత్తం 7 కట్స్ చెప్పడంతో పాటు చేతితో అలాగే సంజ్ఞలు చేసే ఓ సీన్‌కు కూడా అభ్యంతరం చెప్పారని అంటున్నారు. తొలి సగం.. మొత్తం 75 నిమిషాలు ఉంటే. రెండో సగం మొత్తం 65 నిమిషాలుగా ఉంది. ఇక సినిమాలో 7 ఫైట్లు ఇంకా 6 పాటలు ఉన్నాయి. ముంబైలో వేసిన భారీ సెట్లలో యాక్షన్ సీన్లు హైలెట్‌గా నిలుస్తాయని అంటున్నారు.ఇంకా అలాగే భారీ సెట్లలో తీసిన పాటలు కూడా హైలెట్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: