లైగర్: ప్లాపైతే కొండన్న, పూరి పరిస్థితి ఏంటో?

Purushottham Vinay
ఇక ఓ సినిమా తీయాలంటే అసలు మాటలు కాదు. ఎందుకంటే దాని వెనక ఎంతో శ్రమ ఉంటుంది. ఎంతో ప్లానింగ్ కూడా ఉంటుంది. అలా ప్లానింగ్ చేసుకుని తీసిన సినిమాలు అన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.చాలా పెద్ద పెద్ద స్టార్ సినిమాస్ కూడా ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టాయి. భారీ బడ్జెట్ తో తీసిన చాలా బడా సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి.పాపం ఇప్పుడు కూడా ఇదే భయం పట్టుకుంది లైగర్ సినిమా టీంకు. డాషింగ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అన్నయ్య పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో చేస్తున్నారు డైరెక్టర్ పూరి జగన్నాధ్. అయితే రీజన్స్ ఏంటో తెలియదు కానీ సడెన్ గా ఈ సినిమాని కూడా బాయ్ కాట్ చేయాలని కొందరు నెటిజన్స్ నెట్టింట ట్రెండింగ్ లోకి తీసుకొచ్చారు. దానికి మెయిన్ కారణం విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అంటున్నారు కొంత మంది.ఈ సినిమా ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ కాలు పైకి ఎత్తి మాట్లాడడం.. అలాగే ట్రైలర్ ఈవెంట్లో కూడా విజయ్ దేవరకొండ రెచ్చిపోయి మరి మిగతా హీరోలపై పరోక్షంగా కామెంట్లు చేయడం..ఇంకా అది కొందరి హీరో అభిమానులకు నచ్చలేదు.


ఈ కారణంగానే లైగర్ సినిమా ఫ్లాప్ అయితే విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటి అంటూ కొందరు నెట్టింట పోల్ క్రియేట్ చేశారు. ఇంకో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఎక్కువ శాతం విజయ్ సినిమా ఫ్లాప్ అవుతుందని కూడా చెప్పారు. ఎందుకంటే ఓవర్ ప్రమోషన్స్.. అంతకుమించిన విజయ్ దేవరకొండ ఓవర్ యాటిట్యూడ్ ..ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి మెయిన్ రీజన్ అని కూడా అంటున్నారు.ఇంకా అలాగే మరోపక్క అమ్మనాన్న ఓ తమిళమ్మాయి కథ అంటున్నారు.ఎందుకంటే ఈ సినిమాలో సీన్స్ అన్ని అలానే ఉన్నాయంటూ మరో రూమర్ కూడా వైరల్ గా మారింది. అలాగే అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ మోస్ట్ హేటెడ్ పర్సన్ కరణ్ జోహార్ ఈ సినిమాకి నిర్మాత.ఇన్ని అంశాలు వున్న ఈ సినిమా ఖచ్చితంగా ప్లాప్ అవుతుందని అంటున్నారు. అలాగే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే సినిమా ఫ్లాప్ అయితే విజయ్ తో పాటు పూరి జగన్నాథ్ కెరీర్ కూడా ఇక ముగిసినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: