ట్రైలర్: ఈసారి హైవేతో గట్టీగా హిట్ కొట్టేలా ఉన్నా ఆనంద్ దేవరకొండ..!!

Divya
దొరసాని చిత్రం ద్వారా మొదటిసారిగా హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు తర్వాత పుష్పక విమానం సినిమాలో ఆనంద్ దేవరకొండ. అటు తరువాత ఏ సినిమాలో కూడా నటించలేదు అయితే ఇప్పుడు తాజాగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం హైవే. ఈ సినిమా లో హీరోయిన్గా మానస రాధాకృష్ణ నటిస్తున్నది. ఈ చిత్రం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాతగా వెంకట తలారి నిర్మిస్తూ ఉన్నారు. ఆగస్టు 19న ఆహాలో ఈ సినిమా స్ట్రిమింగ్ కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ను ఈ రోజున హీరో నాగశౌర్య విడుదల చేయడం జరిగింది. గత కొంతకాలంగా హీరో ఆనంద్ దేవరకొండ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తిగా భిన్నంగా అడుగులు వేస్తున్నారని చెప్పవచ్చు. అందుచేతనే ఈ కొత్త తరహా సినిమాతో ప్రయోగం చేస్తున్నారు ఇందులో భాగంగానే సైకో క్రైమ్ పిల్లర్ సినిమాకు హైవే మూవీలో నటించారు. ఇందులో విభిన్నమైన పాత్రలో కనిపించారు ఆనంద దేవరకొండ. ఇక ఈ చిత్రం ట్రైలర్ విషయానికి వస్తే అమ్మాయిలని టార్గెట్ చేస్తూ అత్యంత కిరాతకంగా వారిని చంపేస్తూ ఉండే ఒక సైకో కిల్లర్ చుట్టూ తిరిగి కథ అంశం అన్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఇలాంటి హత్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్న నేపథ్యంలో ఆ సైకో కిల్లర్ ఎవరు వారిని పట్టుకుంటారా లేదా అనే అంశంపై ఈ సినిమా కథ కొనసాగుతుంది. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్తో ఆనంద్ దేవరకొండ మరొకసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో సాయామి ఖేర్  పోలీస్ ఆఫీసర్ పాత్రలో డైలాగులు ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఇక విచిత్రంలోని సన్నివేశాలు కూడా ఒళ్ళు గగూర్పుడిచే సన్నివేశాలలా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ సినిమాతో కచ్చితంగా మరొకసారి హిట్టు కొట్టేలా కనిపిస్తున్నాడు ఆనంద్ దేవరకొండ. మరి విజయం సాధిస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: