పుష్ప 2 షురూ.. ఆ పనులలో టీం!!

P.Nishanth Kumar
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే. నార్త్ లో సైతం అల్లు అర్జున్ కు క్రేజ్ విపరీతంగా ఈ సినిమా ద్వారా పెరిగిందని చెప్పవచ్చు.  ప్రస్తుతం అందరి చూపు ఈ సినిమా యొక్క రెండవ భాగం పైనే ఉంది. ఇంకా షూటింగ్ మొదలు పెట్టుకొని ఈ చిత్రంపై ఇప్పటినుంచి ఎన్ని అంచనాలు ఉండడం నిజంగా అల్లు అర్జున్ కు ఏ స్థాయిలో క్రేజీ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో అంశాలు ఈ సినిమాపై ఇన్ని అంచనాలు ఏర్పడడానికి ముఖ్య కారణం.

తాజాగా మారిన పరిస్థితుల రీత్యా పెరిగిన క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా కథను పూర్తిగా మార్చి వేశారు. అంతకు ముందు దర్శకుడు సుకుమార్ ఫిక్స్ అయిన కథను కాకుండా అన్ని వర్గాల వారికి అన్ని ప్రాంతాల వారికి నచ్చే విధంగా ఈ చిత్రం యొక్క కథను పూర్తిగా మార్చి వేశాడు. అందుకే దీనికోసం ఇంతటి సమయాన్ని తీసుకున్నాడు. తొందర్లోనే ఈ సినిమా యొక్క షూటింగ్ ను మొదలు పెట్టాలని భావిస్తున్న సుకుమార్ ముందుగా సంగీతం పనులను పూర్తి చేయాలని చూస్తున్నాడు.

అందుకే ఇప్పుడు ఈ సినిమా యొక్క సంగీతం పనులను చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా బయటకు వచ్చింది. దానిని బట్టి ఈ సినిమా సంగీతం యొక్క పనులను పూర్తి చేశారని చెప్పవచ్చు. చంద్రబోస్ మరియు దేవిశ్రీప్రసాద్లతో కలిసి దర్శకుడు సుకుమార్ ఒక ఫోటోని దిగి ఈ సినిమా యొక్క సంగీతం పనులు షురూ అయినట్లుగా వెల్లడించారు. అయితే సినిమా ను ఎప్పుడు మొదలుపెట్టి ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో అన్నది చూడాలి. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఈ చిత్రంలో సమంత కూడా ఒక కీలక పాత్రలో నటించబోతుంది అని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: