కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినా కిచ్చ సుదీప్ తాజాగా విక్రాంత్ రోనా అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అనూప్ బండారి దర్శకత్వం వహించగా , జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా జూలై 28 వ తేదీన కన్నడ తో పాటు తెలుగు , హిందీ ,, మలయాళ , తమిళ భాషల్లో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది.
ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రపంచ వ్యాప్తంగా మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మొదటి రోజు బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించింది. ఇలా బాక్సా ఫీస్ దగ్గర మంచి టాక్ లభించడంతో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అదిరి పోయే కలెక్షన్ లను వసూలు చేస్తోంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం మంచి వసూళ్లతో దూసుకుపోతున్న విక్రాంత్ రోనా మూవీ పై దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులతో ఒకరు అయిన దర్శక ధీరుడు రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించాడు. విక్రాంత్ రోనా మూవీ విజయం సాధించినందుకు కిచ్చ సుదీప్ శుభాకాంక్షలు. విక్రాంత్ రోనా లాంటి మూవీ చేయాలి అంటే దమ్ము మరియు ఆత్మవిశ్వాసం కావాలి.
ధైర్యంగా ముందుకు అడుగు వేసినందుకు మంచి ఫలితం దక్కింది. ఈ మూవీ కి గుండె లాంటి ప్రీ క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంది. అసలు ఆ క్లైమాక్స్ ను ఊహించలేదు అని సోషల్ మీడియా వేదికగా రాజమౌళి స్పందించాడు. ఇది ఇలా ఉంటే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈగ మరియు బాహుబలి మూవీ లలో కిచ్చ సుదీప్ నటించాడు.