అర్జున్ రెడ్డి లాంటి అడల్ట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ కుర్ర హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ 'లైగర్'. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ మూవీ కోసం టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆగస్టు 25 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. సినిమా ప్రమోషన్లు కూడా ఫుల్ స్వింగ్ లో నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. దానికి కూడా సూపర్ రెస్పాన్స్ లభించింది. అక్డీ పక్డీ అనే పాట కూడా సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్ అయ్యింది.దీంతో 'లైగర్' సినిమాకి ఈ మధ్య కాలంలో ఏ సినిమాకి జరగని విధంగా నాన్ థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది. 'ఆర్ ఆర్ ఆర్', 'సర్కారు వారి పాట', 'కేజీఎఫ్2', 'విక్రమ్', 'మేజర్' సినిమాల లాగా ఇక 'లైగర్' సినిమా కూడా జనాలను థియేటర్ కు తీసుకొచ్చే సినిమా అవుతుంది అని అంతా నమ్ముతున్నారు.
ఇక పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న 'లైగర్' సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీ మొత్తం వెనక్కి రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆశపడుతున్నారు మూవీ మేకర్స్. శాటిలైట్, డిజిటల్ రైట్స్ , ఆడియో రైట్స్ ఇంకా డబ్బింగ్ రైట్స్.. ఇలా మొత్తం కలుపుకుని మొత్తం రూ. 55 కోట్ల నుండి రూ. 60 కోట్ల వరకు పలుకుతోంది. కానీ ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూటర్స్ మాత్రం ఈ లైగర్ మాకొద్దు బాబోయ్ అంటున్నారట. దానికి కారణం ఈ మూవీ రైట్స్ రేట్ ఎక్కువ చెప్పడం. అందుకని ఎవరూ కూడా ఈ మూవీ రైట్స్ ని తీసుకోడానికి ముందుకు రాట్లేదట.దాంతో ఈ మూవీ మేకర్స్ తమ సొంతంగా రిలీజ్ చేసుకోబోతున్నారట. ఇక బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ 'ధర్మ ప్రొడక్షన్స్' అధినేత అయిన కరణ్ జోహార్, 'పూరీ కనెక్ట్స్'(పూరి, ఛార్మి) బ్యానర్ తో కలిసి నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటించగా హీరో విజయ్ దేవరకొండకి తల్లిగా రమ్యకృష్ణ నటించింది.ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ కూడా ఈ మూవీలో నటించడం విశేషం.