తన మాటలే తనకు షాక్ ఇవ్వబోతున్నాయా..?
అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లను మాత్రం రాబట్టలేక పోయింది. ఈ సినిమాలో తను ప్రేమించిన వ్యక్తిని వెతుక్కుంటూ ఉద్యమ బాట పట్టిన యువతిగా అందరిని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాను చూసిన వారంతా సాయి పల్లవి నేషనల్ అవార్డు రావడం గ్యారెంటీ అన్నట్లుగా ప్రశంసలు కురిపించడం జరుగుతోంది. ఇక ఈ సినిమా థియేటర్లో వెళ్లిన తరువాత తన తదుపరిచిత్రంతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాయి పల్లవి. తను నటించిన తాజా చిత్రం గార్గి.
తమిళంలో రూపొందించిన ఈ సినిమాని తెలుగులో కూడా అదే పేరుతో విడుదల చేయడం జరిగింది డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు ఈ సినిమాలో ఒక సాధారణ స్కూల్ టీచర్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక తన తండ్రి అన్యాయంగా అరెస్టు చేసిన పోలీసులపై పోరాడు యువతిగా ఇందులో సాయి పల్లవి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి. మంచి రేటింగ్ సొంతం చేసుకున్న ఈ చిత్రం సాయి పల్లవి కి ఈ ఏడాది నేషనల్ అవార్డు సొంతం చేసుకోవడం ఖాయం ఆన్నట్లుగా తెలియజేస్తున్నారు. తమిళ మీడియాలో మాత్రం ఈ వార్త బాగా వినిపిస్తోంది కానీ అంత ఈజీగా వచ్చే అవకాశం లేదని మరికొంతమంది తెలియజేస్తున్నారు. ఎందుచేత అంటే విరాటపర్వం సినిమా సమయంలో సాయి పల్లవి కాశ్మీర్ పండిట్ ల హత్యలని గోహత్యలతో పోల్చడంతో ఆ విషయం చాలా వైరల్ గా మారింది. దీంతో బిజెపి నాయకులు సాయి పల్లవి పై కేసులు పెట్టారు. ఈ వివాదంతో సాయి పల్లవికి నేషనల్ అవార్డు దక్కడం కష్టమైఆనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.