నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 'ది వారియర్' మూవీ సాధించిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
రామ్ పోతినేని , కృతి శెట్టి జంటగా తమిళ క్రేజీ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్రలో రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ది వారియర్ మూవీ జూలై 14 వ తేదీన చాలా గ్రాండ్ గా తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. మొదటి నుండి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ సినిమా భారీ థియేటర్లలో విడుదల అయ్యింది.

మొదటి నుండి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటం, అలాగే ఈ సినిమాకు భారీ థియేటర్లు దక్కడంతో ఈ మూవీ కి మొదటి రోజు అదిరిపోయే కలెక్షన్లు దక్కాయి. కాకపోతే మొదటి రోజు మొదటి షో కె ఈ సినిమాకు కాస్త మిక్సీడ్ టాక్ రావడంతో ఈ సినిమాకు ఆ తర్వాత రోజు నుంచి కలెక్షన్లు కాస్త తగ్గాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ది వారియర్ మూవీ 4 రోజులు బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది.  మరి నాలుగు రోజులకు గాను బాక్సాఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా ది వారియర్ మూవీ ఏ రేంజ్ కలెక్షన్లను సాధించిందో తెలుసుకుందాం.


నైజాం : 4.71 కోట్లు ,
సీడెడ్ : 2.56 కోట్లు ,
యూ ఏ : 2.06 కోట్లు ,
ఈస్ట్ : 1.12 కోట్లు ,
వెస్ట్ : 1.03 కోట్లు ,
గుంటూర్ : 1.76 కోట్లు ,
కృష్ణ : 80 లక్షలు ,
నెల్లూర్ : 55 లక్షలు .
రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులకు గాను ది వారియర్ మూవీ 14.59 కోట్ల షేర్ ,  22.45 కోట్ల గ్లాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 80 లక్షలు .
ఓవర్ సీస్ లో : 55 లక్షలు .
తమిళ్ లో దాదాపుగా 82 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజులకు గాను ది వారియర్ మూవీ 16.76 కోట్ల షేర్ , 28.00 కోట్ల గ్లాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: