ఆ సినిమా కోసం నయనతార ఏకంగా అన్ని కోట్ల రెమ్యూనరేషన్..!

Pulgam Srinivas
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మలయాళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయిన నయనతార తమిళ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగింది.

ప్రస్తుతం నయనతార అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఎక్కువ ఆసక్తిని మాత్రం తమిళ సినిమాలపై చూపిస్తూ వస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం నయనతార కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతోంది. నయనతార కేవలం కమర్షియల్ సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న లేడీ ఓరియంటెడ్ మూవీ లెస్లో కూడా నడుస్తూ వస్తోంది .ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నయనతార,  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ అనే తెలుగు సినిమాలో చిరంజీవి కి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార  75 వ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

ప్రస్తుతం నయనతార 75 వ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళ్తే ... నయనతార తన 75 వ మూవీ కోసం ఏకంగా 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఒక టాక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న నయనతార తన 75 వ సినిమా కోసం 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: