సరికొత్త కథనంతో వస్తున్న విజయ్ ఆంటోని..!!
ఇందులో హీరో విజయ్ హత్య రహస్యాన్ని చేదించే డిటెక్టివ్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన పాత్రలు ఖిలాడి ఫేమ్ మీనాక్షి చౌదరి నటిస్తున్నది. రీతికా సేన్ కీలకమైన పాత్రలో నటిస్తోంది లోటస్ పిక్చర్స్ తో కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్స్ ఇప్పటికే సినిమా పైన మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా నిన్నటి రోజున ఈ సినిమా మోషన్ పోస్టర్ని చిత్ర బృందం విడుదల చేశారు. ఇక ఆ వీడియోలు లీలాని ఎవరు హత్య చేశారని ఇన్వెస్టిగేట్ పేరుతో కొంతమంది విచారిస్తున్న సన్నివేశాలు ఈ వీడియోలో చూపించడం జరిగింది.
ఈ విచారణలో భాగంగా కొంతమంది మహిళలను ప్రోటోగ్రాఫర్లను విచారిస్తూ ఉంటారు అయితే ఇందులో ఎవరు లీలాని హత్య చేశారు మీరు కాకుండా మరొక వ్యక్తి కారణమా అన్నట్టుగా కథాంశంతో ఈ సినిమా సాగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సాగిపోతున్న ఈ సినిమా తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటూ వస్తోంది. త్వరలోనే థియేటర్లో విడుదల కాబోతున్న ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం తో విజయ్ ఆంటోని మళ్ళీ ట్రాక్ లోకి రావాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటున్నారు. మరి ఆ కోరిక నెరవేరుతుందో లేదో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల వరకు ఆగాల్సిందే..