నాని వేగానికి బ్రేక్ పడిందా..?
ఈ సినిమా కూడా పక్క మాస్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించడం జరుగుతోంది. ఇక నాని మాస్ లుక్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు దీంతో ఈ సినిమా పైన మరింత హైప్ ఏర్పడింది. ఇక ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. నాని దసరా సినిమా తర్వాత ఎలాంటి సినిమా చప్పుడు కనిపించలేదని చెప్పవచ్చు. మరి నాని తన తదుపరి చిత్రాన్ని ప్రకటించకపోవడానికి కారణం ఏంటి.. అనే విషయానికి వస్తే సినిమాల వైఫల్యమే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
హీరో నాని కి సరైన కమర్షియల్ హిట్ సినిమా పడదా దాదాపుగా ఐదేళ్లు అవుతోంది చివరిగా మిడిల్ క్లాస్ సినిమా బాగానే ఆకట్టుకున్న ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. జెర్సీ సినిమాతో మంచి లాభాలను కూడా తీసుకున్నారు నాని. దీంతో ఒక్కసారిగా నాని గ్రాఫ్ పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఇక గత సంవత్సరం శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రేక్షకులం ముందు వచ్చిన ఈ చిత్రంతో మంచి నటుడు గానే పేరు పొందారు కానీ బాక్సాఫీస్ దగ్గర అంతగా కలెక్షన్లు రాబట్ట లేక పోయింది. ఇటీవలే అంటే సుందరానికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోతోంది. ఇలాంటి కారణాలవల్లే నాని సినిమాలు బ్రేక్ పడింది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అంతే కాకుండా మార్కెట్ పరంగా కూడా కాస్త నాని గ్రాఫ్ తగ్గిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.