గార్గి చిత్రం ఆ ఓటిటి లోనే.. ఎప్పుడంటే..?
కానీ ప్రేక్షకుల సంఖ్య ఎంతవరకు పెంచుతుందో అనే విషయం చెప్పడం మాత్రం చాలా కష్టమే అన్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ సినిమాకు పోటీగా ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. అంతేకాకుండా వర్షాలు పడుతూ ఉండడంతో ఈ సినిమాల పైన ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుచేతనే కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే వచ్చే అవకాశం ఉన్నది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తెలుగులో హీరో రానా తమిళంలో సూర్య ట్రైలర్ను విడుదల చేసి సాయి పల్లవి ప్రమోషన్ కు సహాయం చేశారు.
ఈ సినిమా థియేటర్లలో పెద్దగా వర్క్ అయ్యే అవకాశం లేదన్నట్లుగా తెలుస్తోంది కానీ కంటెంట్ కు తగ్గట్టుగా మాత్రం ఓటీటిలో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదట. ఈ సినిమా ఓటీటి హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 28 రోజుల తర్వాత ఓటీటి లో విడుదలయ్యే అవకాశం ఉన్నది ఇక బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు తగ్గితే ఈ సినిమా కాస్త ముందుగానే వచ్చేస్తుంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే ఈ సినిమాలో ఒక అపార్ట్మెంట్లో జరిగిన గ్యాంగ్ రేప్ లో అన్యాయంగా ఒక వాచ్మెన్ ను ఆ కేసులో ఇరికించడం జరుగుతుంది. ఆ తర్వాత తన కుటుంబ పరిస్థితి ఏంటి అనే కథాంశంతో తెరకెక్కించడం జరిగింది. సాయి పల్లవి కూడా ఇందులో అద్భుతమైన ప్రదర్శించింది.