రష్మిక పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..ఇటీవల కాలంలో వరుస హిట్ సినిమాలను చేస్తూ బాగా బిజీగా ఉంటుంది.. నేషనల్ క్రష్ గా ఫేమస్ అయిపోయింది. అదే క్రేజ్ తో బాలీవుడ్ లో వరసగా ఆఫర్లు దక్కించుకుని స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ షూటింగ్ కోసం ముంబై వెళుతోంది.ఆల్రెడీ మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాల షూటింగ్ అయిపోయింది. రణవీర్ తో చెయ్యాల్సిన సినిమా ఇంకా స్టార్టే అవ్వలేదు. మరి రెండు రోజుల క్రితం ముంబై వెళ్లి 2 రోజులకే తిరిగొచ్చిన రష్మిక ముంబైలో ఏం చేసింది అని అంతా ఆలోచిస్తున్నారు.
మొన్న మొన్నటి వరకు షూటింగ్స్ కోసం బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి షటిల్ సర్వీస్ చేసిన రష్మిక ఇప్పుడు ఏకంగా ముంబైకి మకాం మార్చేసిందా అంటున్నారు జనాలు. ఎప్పుడు చూసినా ముంబై చెక్కేస్తున్న రష్మిక అసలు అక్కడ ఏం చేస్తుందా అని ఆరాలు మొదలుపెట్టారు. ఆల్రెడీ రష్మిక బాలీవుడ్ లో సిద్దార్ద్ మల్హోత్రా తో మిషన్ మజ్ను, అమితాబ్ తో గుడ్ బై సినిమాలు చేస్తోంది. ఈ సినిమాల షూటింగ్ అయిపోయింది. సందీప్ రెడ్డి డైరెక్షన్లో రణబీర్ కపూర్ తో చెయ్యాల్సిన సినిమా ఇంకా షూటింగే మొదలవ్వలేదు.
అయితే ఇటీవల ముంబై వెళ్లిన రష్మిక 48 గంటలు కూడా అవ్వకుండానే మళ్లీ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ముంబై ఫ్లైట్ దిగేసింది. ఏ సినిమా షూటింగ్ అయినా కనీసం 10, 15 రోజులుంటుంది. కానీ అలా జరగలేదు. ఏదైనా ఈవెంట్ అటెండ్ అవ్వడానికి వెళ్లిందా అంటే బాలీవుడ్ లో ఎవరి బర్త్ డేలు కానీ, ఎలాంటి సెలబ్రిటీ ఈవెంట్స్ కానీ జరగలేదు. పోనీ తన జాన్ జిగిరీ దోస్త్ విజయ్ దేవరకొండ ముంబైలో ఉన్నాడా అంటే అదీ లేదు, విజయ్ హైదరాబాద్ లోనే అన్నపూర్ణ స్టూడియోలో ఖుషీ సినిమా షూటింగ్ చేస్తున్నాడు..రష్మిక ఎవరినీ కలవడానికి గానీ, ఈవెంట్ కి గానీ వెళ్లకపోతే షూటింగ్ కంప్లీట్ అయిన తన బాలీవుడ్ సినిమాలకు సంబందించి డబ్బింగ్ కోసమైనా వెళ్లుండాలి అంటే వాటి గురించి కూడా ఎలాంటి అధికారిక సమాచారం లేదు..దీంతో జనాలు వారికి ఇష్టమైన కామెంట్లు చేస్తున్నారు..