ఏజెంట్ సినిమా నుంచి మమ్ముట్టి పోస్టర్ వైరల్..!!

Divya
మలయాళ నటుడు మమ్ముట్టి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మాతృభాష లో అగ్ర కథానాయకుడుగా పేరుపొందారు ఇతర భాషలలో సైతం కూడా నటించి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు ఈ నటుడు. ఇదివరకే యాత్ర సినిమా లో కూడా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో నటించి ప్రతి ఒక్క ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇప్పుడు తాజాగా అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇతడి పాత్ర సంథింగ్ స్పెషల్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా విడుదలైన మమ్ముట్టి పోస్టర్ చూస్తే మనకు అర్థమవుతుంది టీజర్ ఈనెల 15న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రం కూడా స్పై థ్రిల్లర్ ఏజెంట్ లో అఖిల్ నటిస్తున్నాడు . ఇక అఖిల్ కు దీటైన పాత్రలు మమ్ముట్టి కూడా నటిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఈ పోస్టర్ విషయానికి వస్తే మమ్ముట్టి మిషన్ గన్ను చేతపట్టి వార్ లో దిగే అధికారిగా కనిపించబోతున్నారు. ఇక మమ్ముట్టికి దేశభక్తి పాత్రలు పెట్టింది పేరు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ విడుదలవ్వడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా లో కీలకమైన సన్నివేశాన్ని ఆగస్టులో చిత్రీకరించారు. ఈ చిత్రాన్ని సురేంద్ర 2 సినిమా బ్యానర్ పైన తెరకెక్కించడం జరిగింది. మరొకవైపు మమ్ముట్టి ఇతర సినిమాలతో కూడా బిజీగానే ఉన్నారు. లెజెండరీ నటుడు శివాజీ గణేషన్ పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి హీరో అఖిల్ కూడా ఈ చిత్రంతో ఎలాగైనా విజయాన్ని సాధించాలని చాలా పట్టుదలతో ఉన్నారు. బ్యాచిలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న అఖిల్ కు ఈ సినిమా మరింత విజయాన్ని చేకూరుస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: