సక్సెస్ సినిమాలకు కెరాఫ్ త్రివిక్రమ్... తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. తనకంటూ ప్రత్యేక బ్రాండ్, ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్ సినిమా వస్తుందంటే, ప్రేక్షకలు ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మంచి కధను కమర్షియల్ హంగుల తో తెరకెక్కించడంలో ఈయన దిట్ట అనే ముద్ర ఎప్పుడో వేసుకున్నారు. అయితే ఇలాంటి త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరైనా మిస్ చేసుకుంటారా.. కానీ ఇప్పుడు అదే జరిగిందట..
తెలుగులో త్రివిక్రమ్ తెరకెక్కించబోయే నెక్ట్స్ సినిమా కోసం హీరోయిన్ ఛాన్స్‌ను ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు భామలు మిస్ చేసుకున్నారు. ఇంతకీ త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ అవకాశాన్ని మిస్ చేసుకున్న ఆ బ్యూటీలు ఎవరనేగా మీరు ఆలోచిస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్ తన నెక్ట్స్ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా అందాల భామ పూజా హెగ్డేను ముందుగానే కన్ఫం చేశారు. కాగా, మరో హీరోయిన్‌కు కూడా ఈ సినిమాలో స్కోప్ ఉందట..
సెకండ్ హీరోయిన్ పాత్ర సినిమా లో కీలకంగానూ, నటన కు మంచి స్కోప్ ఉన్న పాత్రగా త్రివిక్రమ్ తీర్చిదిద్దాడట. అయితే ఈ పాత్ర లో నటించాల్సిందిగా చిత్ర యూనిట్ యంగ్ బ్యూటీలు శ్రీలీలా, నభా నటేష్, నిధి అగర్వాల్ లను సందప్రదించగా.. వారు బిజీ షెడ్యూల్స్ కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమా అవకాశాన్ని వదలుకోవాల్సి వచ్చినట్లు గా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి త్రివిక్రమ్ సినిమా లో ఛాన్స్ దక్కించుకోబోయే ఆ హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.. ఏది ఏమైనా త్రివిక్రమ్ సినిమా లో ఛాన్స్ రావడం అంటే కష్టం అనే చెప్పాలి..