మహేష్ తో రాజీపడవలసి వస్తున్న రాజమౌళి ?

Seetha Sailaja
అత్యంత భారీ సినిమాలు తీసే రాజమౌళి తన సినిమాల మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడడు. అంతేకాదు అతడు సినిమాలలో నటించే హీరోలు చాల కష్టపడవలసి వస్తుంది. అందుకే జూనియర్ ఒకసారి రాజమౌళి గురించి మాట్లాడుతూ అతడి సినిమాలలో నటించే హీరోలు ప్రత్యక్ష నరకానికి సిద్ధపడి ఉండాలి అంటూ ఓపెన్ గా జోక్ చేసిన విషయం తెలిసిందే.

‘బాహుబలి’ లో నటించిన ప్రభాస్ రానా లకు రోజుకు 18 గుడ్లు తినమని టార్గెట్ రాజమౌళి ఇచ్చినప్పుడు ప్రభాస్ రానా లు పడిన పాట్లు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి జక్కన్న ఇప్పుడు మహేష్ తో తీయబోతున్న మూవీలో ప్రిన్స్ ను ఎలా చూపెడతాడు అన్న ఆసక్తితో పాటు మహేష్ కు అతడి లుక్ పరంగా ఎలాంటి టార్గెట్ లు ఇస్తాడు అన్న ఆశక్తి అందరిలోనూ ఉంది.

అయితే ఈవిషయమై ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారంలోకి వచ్చింది. హడావిడి చేస్తున్న ఈ న్యూస్ ప్రకారం ఈమధ్య రాజమౌళి మహేష్ లు తాము చేయబోయే ప్రాజెక్ట్ విషయం గురించి చర్చించుకున్నప్పుడు మహేష్ జక్కన్నకు ఒక సూచన చేసినట్లు టాక్. తాను చేయబోయే ఈమూవీలో తనకు ప్రత్యేకమైన గెటప్ లు డిజైన్ చేయవ్వదని ముఖ్యంగా గుబురు గెడ్డం మీసం పొడుగాటి జుత్తు తనకు నప్పవని అందువల్ల తాను రాజమౌళి సినిమాలో రొటీన్ గెటప్ లోనే కనిపిస్తాను అంటూ సూచన చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాదు తన సినిమా నిర్మాణానికి సమయం రాజమౌళి ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా తను అభ్యంతరం చెప్పానని ఈసినిమా డేట్స్ తో క్లాష్ లేకుండా తాను మరో సినిమాలు చేసుకోవడానికి అభ్యంతరం చెప్పవద్దని మహేష్ చేసిన అభ్యర్ధన రాజమౌళిని ఆలోచనలో పడేసినట్లు టాక్. ఇప్పటివరకు రాజమౌళి సినిమాలో హీరోగా బుక్ అవ్వడం ఆమె అతడి బందికానకి ఆహీరో వెళ్ళిపోయినట్లే లెక్క. అయితే ఇప్పుడు జక్కన్న పద్దతులు మార్చడానికి మహేష్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అన్నది సమాధానం లేని ప్రశ్న..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: