టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం 'సమ్మతమే'.అయితే ఈ సినిమా అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో సాగే మ‍్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కాగా ఈ సినిమాకి గోపీనాథ్ రెడ్డి దర్శకుడు.ఇకపోతే ఈ సినిమాని యూజీ ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ్ నిర్మించారు.కాగా జూన్ 24న విడుదల అయిన ఈ చిత్రం ఫెరఫెక్ట్ రొమాంటిక్ కామెడీగా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే ఈ చిత్రం కొన్ని రోజుల్లోనే ప్రాఫిట్స్ అందుకున్నట్టు మేకర్స్ చెప్పారు.తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి లో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు తీసుకున్న ఆహా వారు చెప్తున్నారు.
ఇకపోతే జూలై అంటే ఈ నెల 15 నుంచి "సమ్మతమే" ఓటిటి రిలీజ్ డేట్ అంచూ అనౌన్సమెంట్ చేసారు.ఇక చిత్రం కథేమిటంటే... కృష్ణ అనే ఒక యువకుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గ వర్క్ చేస్తుంటాడు. ఇకపోతే అతడికి పెళ్ళికి ప్రేమ అనేదానిమీద నమ్మకం ఉండదు.ఇక దీంతో ఎంతోమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో తనదగ్గరకు వచ్చినా కాదంటాడు.అయితే ఆ సమయంలో హీరోయిన్ ఎంటర్ అవుతుంది. కాగా ఆమెతో పరిచయం, స్నేహం వరకు దారి తీస్తుంది. పోతే ఆ స్నేహం, ప్రేమ అనే విషయం కృష్ణ కు తెలియడానికి చాలా టైమ్ పడుతుంది.ఇకపోతే పెళ్ళికి ముందు ప్రేమంటే నాకు పడదు.. అందులో నేను పడను అంటూనే ప్రేమలో పడిన యువకుడు.. చివరికి ఆ అమ్మాయి ప్రేమను గెలుచుకున్నాడా..?
ఇక వారి ప్రేమకు వచ్చిన ఇబ్బందులు ఏంటి..? అనేది కథగా తెలుస్తుంది. 'ఆహ్లాదభరితంగా సాగే ప్రేమకథా చిత్రమిది. అయితే ఓ జంట ప్రయాణంలోని మధురానుభూతులకు దర్పణంలా ఉంటుంది. పోతే ఆద్యంతం చక్కటి వినోదంతో ఆకట్టుకుంటుంది.ఇకపోతే ఈ సినిమా టీమ్ చేసిన మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా జనంలోకి బాగా వెళ్లాయి.పోతే శేఖర్ చంద్ర ట్యూన్, కృష్ణకాంత్ సాహిత్యం ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.అయితే ఈ సినిమాలో కిరణ్, చాందినీ చౌదరీల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ అదిరిపోయిందనే టాక్ వచ్చింది. ..!!