తెలుగు అగ్ర హీరో,మన్మథుదు కింగ్ అక్కినేని నాగర్జున కు గత కొంత కాలంగా సరైన హిట్ పడలేదు..రెండు మూడు సినిమాలు వచ్చిన కూడా అవి కేవలం పేరుకు మాత్రమే అన్న విధంగా ఉన్నాయి. దాంతో ఇటీవల వచ్చిన సొగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగర్రాజు సినిమాకు కాస్త గ్యాప్ తీసుకున్నాడు.. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.దాంతో ఇప్పుడు నాగ్ వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు..ప్రస్తుతం నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం 'ది ఘోస్ట్' కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ వస్తున్నారు.
సినిమా వచ్చి చాలా రోజులు అవుతుండటంతో ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవాలని అక్కినేని అభిమానులు కోరుతున్నారు. ఇక ఈ సినిమాను డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి నెలకొంది..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఈ సినిమా నుండి ఓ అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర యూనిట్. ది ఘోస్ట్ సినిమా నుండి ఓ ఎలక్ట్రిఫైయింగ్ అప్‌డేట్‌ను ఉదయం 11 గంటలకు ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా నుండి రాబోయే అప్‌డేట్ ఏమిటా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ లేదా టీజర్‌కు సంబంధించిన అప్‌డేట్ అయి ఉండవచ్చని వారు అంటున్నారు..
ఈ సినిమాలో నాగ్ పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో అర్థమవుతోంది. మరి రేపు నాగ్ ఎలాంటి అప్‌డేట్‌తో అభిమానుల ముందుకు వస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో అందాల భామ సోనల్ చౌహాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, నారాయణ్ దాస్ కే నారంగ్, రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు..సస్పెన్స్ కథగా వస్తున్న ఈ సినిమాలో నాగ్ లుక్ సరికొత్తగా ఉండనుంది. దీంతో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..