కళ్యాణ్ రామ్ ఖాతాలో హిట్ పడుతుందా?

Satvika
నందమూరి కళ్యాణ్ రామ్ ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నాడు. కొన్ని హిట్ సినిమాలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా హిట్ సినిమాలు లేవు. చాలా కాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ సినిమాలలొకి వచ్చాడు. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'బింబిసారా' ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.సరికొత్తగా ఈ సినిమా ఉండనుందని పోస్టర్ ను చూస్తె తెలుస్తుంది.ఫాంటసీ యాక్షన్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఇప్పటికే రిలీజ్ కాగా, తాజాగా ఈ సినిమా నుండి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ఓ చిన్న ట్రైలర్ గ్లింప్స్ వీడియోతో అనౌన్స్ చేశారు బింబిసారా చిత్ర యూనిట్. ''ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు..'' అంటూ పవర్‌ఫుల్ డైలాగ్‌ను నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పిన విధానం సూపర్బ్‌గా ఉండటంతో ఈ ట్రైలర్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 4న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు ప్రకటించింది.

సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తుండటంతో ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మల్లిడి వశిష్ట్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, కేథరిన్ త్రేజా, వరీనా హుస్సేన్, సంయుక్తా మీనన్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఆగస్టు 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది..సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల మాత్రమే ఉండటం తో చిత్ర యూనిట్ భారీ ప్లానులు వేస్తుంది.. ఎలాగైనా హిట్ కొట్టాలని ఆలోచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: