రాశి ఖన్నా.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు ఎన్నో సినిమాల లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది..కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకున్నాయి. మరి కొన్ని సినిమాలు ఓ మాదిరిగా అలరించాయి..ఊహాలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు ప్రేక్షకులని అలరించిన అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందింది ఈ ముద్దుగుమ్మ..
ప్రస్తుతం అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది.తెలుగు, తమిళం, హిందీ మూవీల్లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీయేస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. విభిన్న పాత్రలను పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. స్టార్ హీరోలతో నటించకపోయిన మీడియం స్టార్ హీరోలతో నటిస్తూ అభిమానులకి దగ్గరైంది. కామెడీ సీన్స్ చేయడం కన్నా.. రొమాంటిక్ సీన్స్‌లో నటించడమే ఇష్టమని అంటోంది స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా.
రాశీ ఖన్నా హీరోయిన్‌గా, గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పక్కా కమర్షియల్’. జులై 1న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా రాశీ ఖన్నా ఇంటర్వ్యులతో బిజిబిజీగా గడపగా, ఈ ప్రమోషన్స్‌లో ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఎలాంటి సినిమాల్లో నటించడం మీకు ఇష్టం అని అడగ్గా ఆమె ఈవిధంగా సమాధానం ఇచ్చింది. ‘నాకు రొమాంటిక్ సీన్స్ అంటే ఇష్టం. కామెడీ సీన్స్ కంటే.. రొమాంటిక్ సీన్లలో నటించడమే సులభం..అని చెప్పింది.అందులో రాశి ఇప్పుడు మరింత గ్లామర్ గా కనిపిస్తుంది..అందాల ఆరబొతకు కూడా అమ్మడు రెడీగా ఉంది.. ఇక నెక్స్ట్ ఎవరి సినిమాలో కనిపిస్తుందొ చూడాలి..టాలీవుడ్ కే పరిమితమైన ఈ బ్యూటీ ఇటీవల బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నా.. తెలుగు సంప్రదాయాలను పాటిస్తూ ఆడియెన్స్ కు మరింత దగ్గరవుతోంది. ఒకవైపు శారీలో కనిపిస్తూనే మరోవైపు కేక పెట్టించే అందాలతో కుర్రకారు మతులు పోగొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎగసిపడుతున్న ఎద అందాలు చూపిస్తూ కేక పెట్టిస్తుంది. రాశీ ఖన్నాని ఇలా చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. బాబోయ్ ఇదేం బ్యూటీ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాశీ ఖన్నా పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..