రామ్ 'ది వారియర్' హిట్ పక్కా... ప్రూఫ్ ఇదే?

VAMSI
ఇటీవల మంచి సక్సెస్ లేక నిరాశలో ఉన్న హీరో రామ్ పోతినేని కి ఇస్మార్ట్ శంకర్ మూవీ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చేలా చేసింది. ఒకరకంగా చెప్పాలంటే కెరియర్ లో ఘన విజయాన్ని అందించిందని చెప్పాలి. ఈ సినిమా తరవాత రామ్ చిత్రాలకు మార్కెట్ భారీగా పెరిగింది.కాగా తాజాగా రామ్ చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ ది వారియర్ . ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ యంగ్ హీరో రామ్ పోలీస్ పాత్రలో తొలిసారి కనిపించబోతుండటం తో ఫ్యాన్స్ చాలా ఈగర్ గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.
ఇక ఈ సినిమాలో రామ్ కి జోడీగా కృతిశెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కథ మైయిన్ ప్లస్ కాగా , సంగీతం కూడా మరో బలం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఓ సినిమా తెరకెక్కుతుంది అంటే హీరో, కథాంశం తరవాత పాటలే బాగా ఆకట్టుకుంటున్నాయి. ముందుగా రిలీజ్ అయ్యే పాటలు జనాల మనసును గెలిస్తే చాలు.. ఇక ఆ సినిమా గ్రాండ్ ఓపెనింగ్స్ కి  ఏమాత్రం  డోకా లేదనే చెప్పాలి. ఇదే తరహాలో ది వారియర్ చిత్రానికి కూడా  ఆడియో ప్రధాన బలంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే రంగం లో ఉంది రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్.
ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదల అయిన మూడు పాటలు కూడా  ఆడియన్స్ మనసును గెలుచుకుని ఉర్రూతలూగిస్తున్నాయి.  ఈ పాజిటివ్ వైబ్స్ మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ రాబట్టేందుకు చక్కగా ఉపయోగపడతాయి అని చెప్పడం లో సందేహం లేదు అంటున్నారు సినీ విశ్లేషకులు . ఇక మరోవైపు అసలే దూకుడు మీదున్న హీరో రామ్ అందులోనూ పోలీస్ గెటప్... ఇక అసలు బాక్స్ఆఫీస్ దగ్గర కొత్త రికార్డులతో పరుగులు తీయించడం ఖాయం అంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: