విజయ్ ను ఇబ్బంది పెడుతున్న లీకులు..!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస లీకులతో ఇబ్బందులు పడుతున్నాడు. గతం లో ఆయన హీరోగా నటించిన టాక్సీవాలా చిత్రం లీక్ అయ్యింది. అయితే అలా లీక్ అయినా కూడా ఆ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చడంతో మంచి వసూళ్లను సాధించి ఆయనకు పెద్ద హిట్టు ను తెచ్చి పెట్టింది.  అప్పటి నుంచి ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటున్న విజయ్ దేవరకొండ కొన్ని సాధారణ అప్డేట్లను మాత్రం ఆపలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన పూరి జగ న్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 25వ తేదీన విడుదల కావడానికి సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడానికి సర్వం సిద్ధం చేస్తుంది. పలు కార్యక్రమాలలో పాల్గొనడానికి చిత్ర బృందం రెడీ అవుతుంది హీరో తో పాటు హీరోయిన్ మరియు దర్శకుడు కూడా ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనబోతున్నారు. 

తాజాగా ఈ సినిమా యొక్క ప్రమోషనల్ సాంగ్స్ ను తెరకెక్కించిన ఈ చిత్ర బృందం ఆ సినిమాలోని ఈ పాటలో యొక్క లుక్ ను బయట పెట్టకపోయినా అది లీక్ అవ్వడం వారిని ఎంతగానో నిరాశ పరుస్తుంది. ఇలాంటి లీకులు ఏ సినిమాకైనా మైనస్ గా మారతాయి అన్న విషయం తెలిసిందే. ముందే లీకుల ద్వారా చూస్తే ఆ తర్వాత సినిమాను చూసేవారికి పెద్దగా ఎగ్జైట్మెంట్ అనిపించదు అనేది కొంత మంది చెబుతున్న మాట. ఇకపోతే ఈ సినిమాతో పాటే విజయ్ దేవరకొండ ఖుషి అనే ప్రేమ కథ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఇందులో సమంత కథానాయకగా నటిస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే ఆయన మరొక సినిమా కూడా చేస్తున్నాడు.  జే జీ ఎమ్ అనే టైటిల్ ను చిత్రానికి నిర్ణయించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: