జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పిన అనసూయ.. షాక్ లో ఫ్యాన్స్..?

Anilkumar
బుల్లితెరపై 'జబర్దస్త్' షోకి ఉన్న ఫాలోయింగ్ గురించి మనకి తెలిసిందే. ఇకపోతే యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ షో చూస్తుంటారు. ఇక ఈ షో కి   ఎన్ని వివాదాలు ఎదురైనా  కూడా ఇప్పటికీ నెంబర్ వన్ కామెడీ షోగా దూసుకుపోతుంది 'జబర్దస్త్'. అయితే ఈ షోని మొదలుపెట్టి దాదాపు తొమ్మిది సంవత్సరాలు అవుతోంది. కాగా అత్యధిక టీఆర్ఫీతో దూసుకుపోతుంది. ఇక దీంతో ఈ షోని కాపీ చేస్తూ చాలా కామెడీ షోలు వచ్చాయి.అయితే  కానీ 'జబర్దస్త్' ముందు ఏదీ నిలవలేకపోయింది. ఇదిలావుంటే  ఈ మధ్యకాలంలో 'జబర్దస్త్' రేటింగ్స్ తగ్గుతున్నాయి. 

అయితే రొటీన్ స్కిట్ లతో ప్రేక్షకులను విసిగిస్తున్నారు.ఇకపోతే ఒకట్రెండు టీమ్స్ మినహా.. మిగిలిన వాళ్ల స్కిట్ లను చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడడం లేదు.అయితే ప్రస్తుతం యూట్యూబ్ లో ఎపిసోడ్స్ ను బిట్స్ బిట్స్ గా టెలికాస్ట్ చేస్తుండడంతో.. తమకు నచ్చిన స్కిట్ లను చూసుకుంటున్నారు ఆడియన్స్. ఇక దీంతో సరైన రేటింగ్స్ రావడం లేదు. ఈ రేటింగ్ ను మరింత ఎఫెక్ట్ చేస్తూ.. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వంటి కమెడియన్స్ షో నుంచి తప్పుకున్నారు.  ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా ఇప్పుడు యాంకర్ అనసూయ వంతు వచ్చింది.

అయితే  ఈ షో నుంచి ఆమె తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.అంతేకాక  నిజానికి ఈ షోతో అనసూయ విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. అయితే అలాంటిది ఆమె ఈ షోకి గుడ్ బై చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది అనసూయ.ఇకపోతే ఆమె  'జబర్దస్త్' షో పేరు ప్రస్తావించకుండా.. తను తప్పుకుంటున్నట్లు చెప్పింది. అంతేకాక తన కెరీర్ లో తీసుకున్న పెద్ద డెసిషన్ ను ఈరోజు నుంచి అమలు చేస్తున్నట్లు చెప్పింది. దీనితోపాటు చాలా జ్ఞాపకాలను నాతో పాటు తీసుకెళ్తున్నాను.. అందులో మంచి, చెడు అన్నీ ఉన్నాయని తెలిపింది.అయితే  మీరంతా ఎప్పటిలానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అంటూ రాసుకొచ్చింది.ఇక ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అనసూయ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటా..? అని ఆరా తీస్తున్నట్లు అభిమానులు.ఇక  ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలు  ఒప్పుకుంటుంది.అంతేకాకుండా  లీడ్ రోల్స్ లో కొన్ని సినిమాలు చేస్తూనే.. మరోపక్క పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది...!!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: