అందుకే సాయి పల్లవి ని మేటినటి అనేది..!!

P.Nishanth Kumar
తెలుగులో గ్లామర్ కథానాయిక లకే ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి. కేవలం నటన మాత్రమే నమ్ముకుంటే వారి కెరీర్ అతి తక్కువ కాలంలోనే ముగిసిపోతుంది. అలా కాకుండా గ్లామర్ మరియు నటన రెండింటిలో కూడా అవదులు లేకుండా చేస్తేనే వారికి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది టాలీవుడ్ సినిమా పరిశ్రమలోని సూత్రం. ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా ఈ విధమైన గ్లామర్ హీరోయిన్లకు ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉంటాయి.

అయితే కొంత మంది నటీమణులు మాత్రం ఈ రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటారు. వారు నటనతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆదరిస్తూ ఉంటారు గ్లామర్ ప్రదర్శించాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు అలాంటి వారిలో ఒకరు సాయిపల్లవి. మలయాళ ముద్దుగుమ్మ అయిన ఈమె అక్కడ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని తెలుగులో డిమాండ్ ఏర్పరచుకుంది. ప్రేక్షకుల కోరిక మేరకు ఆమె తెలుగులో కూడా నటించడం మొదలుపెట్టింది.

 నటించిన మొదటి సినిమా నుంచి నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది చిన్నసైజు హీరోకి ఉన్న మార్కె ట్ ఆమెకు ఉంది. అంటే ఆమె ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చెప్పవచ్చు. తాజాగా ఆమె నటించిన విరాట పర్వం సినిమా విడుదల అయ్యింది. రానా కథానాయ కుడిగా నటించిన ఈ సినిమా లో పూర్తిగా సాయిపల్లవి డామినేషనే కనిపించింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ను నటనా తీరును అలనాటి నటీమ ణులతో పోలుస్తున్నారు. ఆమె నటన వారికి ఏ మాత్రం తగ్గని రేంజ్ లో ఉందని పొగుడుతున్నారు. మరి ఈ తరం హీరోయిన్లలో ఈమెకు ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పడడానికి కారణం ఆమె నటనే అని చెప్పాలి. మరి తన నటనతో ఇప్పటికే సౌత్ ను అలరిస్తున్న ఆమె నార్త్ లో కూడా తన సత్తా చాటుతుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: