నయనతార వివాహం తర్వాత వాటికి ఎస్ చెప్పనుందా..?

Divya
ఏ ఇండస్ట్రీలో అయినా హీరో , హీరోయిన్స్ ఏదైనా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంటే.. ఆ సినిమా షూటింగ్ ప్రమోషన్స్, మీడియా అట్రాక్షన్ ,ఇంటర్వ్యూలు తదితర వాటికి భాగస్వాములుగా అవుతామని అగ్రిమెంట్ చేసుకున్నట్లు అని చెప్పవచ్చు. అయితే ఇలాంటి వాటి నుండి సీనియర్ హీరోయిన్ అయిన నయనతార కు మినహాయింపు ఉన్నది అని చెప్పవచ్చు ఎందుచేత అంటే నయనతార ఏ భాషలో సినిమా చేసిన మీడియా ప్రమోషన్ లకు కాస్త దూరంగానే ఉంటుంది. ఈ విషయాన్ని ముందుగానే క్లియర్గా మేకర్స్ కు తెలియజేస్తుంది.

ఇదే విధంగా అడ్వాన్స్ తీసుకొని అగ్రిమెంట్ కూడా చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు తాజాగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించే అవకాశం ఎక్కువగా ఉంది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార కు ఉన్న పర్సనల్ కారణాల వల్ల సినిమా ప్రమోషన్స్ రాలేదని చెబుతూ ఉంటారు. ఇక ఆ విషయాలు ఏంటనేది అందరికీ తెలిసినవే. హీరో శింబు, ప్రభుదేవా తో చేసిన వ్యవహారాలే అందుకు కారణం అన్నట్లుగా కోలీవుడ్ జనాలు అంటూ ఉంటారు. ఇక వీరిద్దరి తో ఉన్న రిలేషన్ షిప్ కి గుడ్ బై చెప్పడం తో నయనతార ఇలాంటి కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నది.

ఇక ఆ తర్వాత డైరెక్టర్ విగ్నేష్ తో ప్రేమలో పడి తాజాగా పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఇప్పుడు విగ్నేష్ ని వివాహం చేసుకున్న తర్వాత నయనతార ప్రమోషన్లలో భాగం కావడానికి అంగీకరించవచ్చ ని ఇండస్ట్రీలో టాక్ గా వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే నిర్మాతలు ఫిలిం మేకర్స్ చాలా ఆనంద పడతారు అని చెప్పవచ్చు. అయితే నయనతార మాత్రం రొమాంటిక్ సన్నివేశాల్లో నటించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటీవలే KRK ఈ సినిమాతో నయనతార బాగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలు నటిస్తున్నది సినిమాలో చిరంజీవి నాకు ఇస్తున్నారు షారుక్ ఖాన్ తో కూడా జవాన్ అనే చిత్రంలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: