వీడియో: మురారి పాటతో కీర్తి సురేష్.. కుమ్మేసిందిగా..!!

Divya
సూపర్ స్టార్ మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా కలిసి నటించిన చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం విడుదల ఇప్పటికి మూడు వారాలు అయినా ఇంకా కలెక్షన్ల పరంగా బాగా రాణిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో మురారివా అనే పాటను యాడ్ చేయడం జరిగింది. దీంతో మరొకసారి మహేష్ అభిమానులు సినిమా క్యూ కట్టారు. అయితే థియేటర్ లో యాడ్ చేసిన కొద్ది రోజులకు యూట్యూబ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాట బాగా అలరిస్తోంది. మహేష్ కీర్తి సురేష్ కాంబినేషన్ లో ఉన్న ఈ పాట బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.


ఈ పాటని ఎంతో అందంగా చిత్రీకరించారు డైరెక్టర్ పరుశురామ్. ఇక హీరో, హీరోయిన్లను ఎంతో చక్కగా చూపించి సక్సెస్ బాట పట్టారు డైరెక్టర్. ఇక ఈ పాట కోసం భారీగానే సెట్టింగ్ వేసినట్లుగా కనిపిస్తోంది. ఇక ఈ సెట్టింగ్ కోసం భారీగానే ఖర్చు చేసినట్లుగా సమాచారం అంత ఖర్చు చేశారు కనకనే ఈ సినిమా నుండి ఆ పాటను తొలగించినా మళ్లీ యాడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పాట వీడియో వైరల్ కావడంతో యూట్యూబ్ లో చాలా ట్రెండీగా మారుతోంది.


ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కీర్తి సురేష్ ఈ పాటలో స్కిన్ షో చేసిందని చెప్పవచ్చు. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా కవర్ చేసుకుంటూ కనిపించిన కీర్తి సురేష్ ఈ సినిమాలో కాస్త లిమిట్ క్రాస్ చేసినట్లుగా కనిపిస్తోంది. కమర్షియల్ హీరోయిన్ అంటే కనీసం గుర్తింపు లభించలేదు అనుకొని.. కీర్తి సురేష్ ఇలా ఈ సినిమాలో ఈ పాటలో నటించింది అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తి సురేష్ గతంలో క్లీవేజ్ షో తో పాటు తన థైస్ చూపించకుండా మేనేజ్ చేస్తూ ఉండేది. మొత్తానికి ఇప్పటి వరకు చూడని కీర్తి సురేష్ అనే ఈ పాట లో చూడవచ్చు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: